నయా స్టైల్ 'టమాటో పూదీనా చట్నీ'.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
చాలామందికి టమాటో పచ్చడి అంటే ఇష్టం ఉంటుంది. ఇంట్లో కూరలు లేనప్పుడు.. మిగతా కర్రీలు తినాలని అనిపించనపుడు ఈ పచ్చడిని చేసుకుంటూ ఉంటారు. టమాటో పచ్చడి లంచ్ బాక్స్ లోనూ భలే కమ్మగా ఉంటుంది. టమాటో పచ్చడిలో కాస్త పూదీనా యాడ్ చేస్తే ఆ టేస్టు ఇంకా బాగుంటుంది. మరి సూపర్ టేస్టీ టమాటో పూదీనా చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..?
టమాటో పూదీనా చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. టమాటోలు, చింతపండు, పూదీనా, పచ్చిమిర్చి, ఆవాలు, నువ్వులు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, నూనె, ఉప్పు తగినంత తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీ తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై గిన్నె పెట్టుకోవాలి. అందులో నువ్వులు వేసి వేయించుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి గ్రైండింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు అదే గిన్నెలో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆ మిశ్రమంలో టమాటో ముక్కలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి దగ్గరకు అయ్యేంత వరకూ మగ్గించుకోవాలి. టమాటోలు మగ్గిన తర్వాత ఆ మిశ్రమంలోనే పూదీనా ఆకులు వేయాలి. మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఆ తర్వాత టమాటో మిశ్రమం చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జారులో వేసి బరకగా అయ్యేంత వరకూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాళింపు చేసుకోవాలి. తాళింపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ తాళింపులో మిక్సీ పట్టిన టమాటో పేస్టును వేసి ఆ తర్వాత నువ్వుల పొడి కూడా వేయాలి. నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ టమాటో పూదీనా చట్నీ రెడీ అయినట్టే..
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications