గెలుపు ఖాయం చేసుకున్న ట్రంప్?
Donald Trump: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి.. పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ ఏడాది చివర్లో ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. జనవరి 20వ తేదీన ఆ దేశ కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయక్కడ.
2019 నాటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు మళ్లీ జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు.

రిపబ్లికన్ల తరఫున కూడా అభ్యర్థి మారలేదు. 2019 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనెటర్ జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరు ఖరారైంది. ఈ రెండు పార్టీలు కూడా విస్తృతంగా ఎన్నికల ర్యాలీలను నిర్వహిస్తోన్నాయి.
తాజాగా విస్కాన్సిస్‌లోని మిల్వాకీలో నేషనల్ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేసింది రిపబ్లికన్ పార్టీ. నాలుగు రోజుల పాటు జరిగిన వర్క్ షాప్ ఇది. చివరి రోజు- భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వాన్స్‌తో కలిసి డొనాల్డ్ ట్రంప్ దీనికి హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల సెనెటర్లు, భారీ సంఖ్యలో మద్దతుదారులు, రిపబ్లికన్ పార్టీ అభిమానులు ఇందులో పాల్గొన్నారు.
పెన్సిల్వేనియాలో కాల్పుల తరువాత ట్రంప్ హాజరైన తొలి బహిరంగ సభ ఇదే కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. తనపై కాల్పుల గురించి ప్రస్తావించారాయన. ఇంకో నాలుగు నెలల్లో తాము ఓ అద్భుతమైన విజయం సాధించబోతోన్నామని వ్యాఖ్యానించారు. ఓ కొత్త శకానికి నాంది పలకబోతోన్నామంటూ ధీమా వ్యక్తం చేశారు.
Make America Great Again అనే నినాదంతో ఎన్నికల్లో పోరాడుతామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. జో బైెడెన్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో అమెరికా సగం మాత్రమే విజయం సాధించిందని, దాన్ని తాము పరిపూర్ణం చేస్తామని అన్నారు.
పెన్సిల్వేనియా దాడిలో దేవుడే తనను రక్షించాడని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దేవుడు తన వైపు ఉండటం వల్లే హత్యాయత్నం తరువాత మళ్లీ అమెరికన్ల ముందుకు రాగలిగానని భావోద్వేగంతో చెప్పారు. తాను తల తిప్పకపోయివుంటే ఆ బుల్లెట్ తన ప్రాణాలను తీసివుండేదని అన్నారు. ఈ సంఘటన గురించి మళ్లీ మళ్లీ ప్రసావించదలచుకోలేదని, దాన్ని గుర్తు చేసుకోవడం బాధాకరమని ట్రంప్ చెప్పారు.
బుల్లెట్లు దూసుకొస్తున్నా దేవుడు తన వైపు ఉండటం వల్ల సురక్షితంగా బయటపడగలిగానని ట్రంప్ అన్నారు. అమెరికాను మళ్లీ గొప్పగా మలిచే మిషన్‌లో ఏదీ తనను ఆపబోదని, వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. ప్రసంగం ముగిసిన తరువాత మెలానియా ట్రంప్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు ట్రంప్.












Click it and Unblock the Notifications