Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్..! టాప్ 3 అగ్రరాజ్యంగా భారత్-తాజా ర్యాంకింగ్స్..!

ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో, భారతదేశం మేజర్ పవర్‌గా మూడవ స్థానంలో ఉంది, US మరియు చైనా తర్వాత. భారతదేశ సైనిక మరియు ఆర్థిక వృద్ధి గురించి తెలుసుకోండి.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన సైనిక శక్తికి నిదర్శనంగా నిలిచింది. అంతర్జాతీయంగా పోటాపోటీగా అగ్రరాజ్యాలు అనిపించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్న వేళ .. అసలు టాప్ దేశానికి కావాల్సిన సత్తా మనకు ఉందని ఇది నిరూపించింది. దీని ప్రభావం తాజాగా వెలువడిన ఆసియా పవర్ ఇండెక్స్ ర్యాంకుల్లో కనిపించింది. ఇందులో భారత్ ప్రపంచ టాప్ 3 దేశాల్లో ఒకటిగా చోటు సంపాదించింది.

ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం అగ్రరాజ్యం స్థాయిని చేరుకుంది. లోవీ ఇన్‌స్టిట్యూట్ తాజాగా వెలువరించిన నివేదిక ప్రకారం 'ఆపరేషన్ సింధూర్'లో మన దేశం పనితీరు ఆధారంగా మూడవ స్థానాన్ని పొందింది. ఈ సూచికలో అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను నిలుపుకొని 'సూపర్ పవర్స్'గా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉరీ జలవిద్యుత్ ప్లాంట్‌పై పాకిస్తాన్ దాడిని మన సీఐఎస్‌ఎఫ్ ఎలా నిలువరించిందో 'అన్‌టోల్డ్ బ్రేవరీ ఇన్ ఆపరేషన్ సింధూర్' వెల్లడించింది.

India Ranks as Major Power in Asia Power Index Boosted by Operation Sindoor

2024లో ఈ జాబితాలో 38.1 స్కోరుతో ఉన్న మధ్య స్దాయిలో ఉన్న భారత్.. ఈ ఏడాది ప్రకటించిన నివేదికలో 100కి 40 పాయింట్లు సాధించింది. జపాన్ (38.8), రష్యా (32.1) కంటే భారత్ ముందుంది. అయినా.. 73.7 పాయింట్లతో ఉన్న చైనాతో పోలిస్తే భారత్ ఇంకా చాలా దూరంలో ఉంది. 80.5 పాయింట్లతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆర్థిక, సైనిక సామర్థ్యాలలో భారత్ వృద్ధి చెందడం ఈ ర్యాంకుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

అలాగే ఆర్థిక సంబంధాలలో భారత్ తొమ్మిదవ స్థానానికి చేరుకుంది. అంతర్గత పెట్టుబడుల పెరుగుదల దీనికి దోహదపడింది. అంతర్జాతీయ అనుసంధానం, ప్రభావితం చేసే సామర్థ్యం, సాంకేతిక అభివృద్ధి ద్వారా భారత్ యొక్క భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతలో చిన్నపాటి పురోగతిని లోవీ ఇన్‌స్టిట్యూట్ నివేదిక గుర్తించింది. అలాగే భారత సైనిక సామర్థ్యాలు క్రమంగా పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది.

India Ranks as Major Power in Asia Power Index Boosted by Operation Sindoor

ఈ ఏడాది మేలో ప్రారంభమైన 'ఆపరేషన్ సింధూర్'లో భారత్ పనితీరు దీనికి దోహదపడిందని తెలిపింది. ఇది భారత్ యొక్క పోరాట అనుభవాన్ని పెంచిందని కూడా వెల్లడించింది. అయితే రక్షణ నెట్‌వర్క్‌ల విషయంలో భారత్ 11వ స్థానానికి పడిపోయింది. 2024 ర్యాంకింగ్‌లతో పోలిస్తే ఇది రెండు స్థానాలు దిగువకు జారింది. ఫిలిప్పీన్స్, థాయిలాండ్ మన కన్నా ముందున్నాయి. ఈ నివేదిక ప్రకారం అమెరికా తర్వాత అత్యధిక అంతర్గత పెట్టుబడులను ఆకర్షించే దేశంగా చైనాను భారత్ వెనక్కినెట్టింది. ఇది పదేళ్ల పెట్టుబడుల ప్రవాహాలను తెలియజేస్తుంది. రక్షణ భాగస్వామ్యాలను నిర్మించడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ తాజా సైనిక అనుభవం, ఆర్థిక వృద్ధి దాని ప్రాంతీయ స్థానాన్ని బలోపేతం చేశాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+