మరియమ్ నవాజ్ కొడుకు పెళ్లిలో ‘ఇండియా’ టచ్.. పాకిస్థాన్‌లో రచ్చ రచ్చ!

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవడు, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియమ్ నవాజ్ కుమారుడైన జునైద్ సఫ్దర్ వివాహం శనివారం లాహోర్‌లో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుక ముగిసిన 24 గంటలకే పాకిస్థాన్‌లో పెనువివాదం చెలరేగింది. నవాజ్ షరీఫ్ కుటుంబాన్ని నెటిజన్లు 'దేశద్రోహులు' అని సంబోధిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదానికి ప్రధాన కారణం ఆ పెళ్లిలో ఉపయోగించిన 'ఇండియన్ డ్రెస్సులు'.

భారత డిజైనర్ డ్రెస్.. పాకిస్థానీల ఆగ్రహం
జునైద్ సఫ్దర్ భార్య శాన్జే అలీ తన వివాహ వేడుకలో ఎరుపు రంగులో మెరిసిపోతున్న అందమైన బ్రైడల్ లెహంగాను ధరించారు. అయితే ఆ లెహంగాను డిజైన్ చేసింది ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీ. తరుణ్ తహిలియానీ కేవలం ఒక డిజైనర్ మాత్రమే కాదు, ఆయన భారత మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హెచ్. తహిలియానీ కుమారుడు. ఆర్.హెచ్. తహిలియానీ 1971లో భారత్-పాక్ యుద్ధ సమయంలో 'ఐఎన్ఎస్ విక్రాంత్' కమాండింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. పాకిస్థాన్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కుమారుడి వద్ద డ్రెస్ కొనుగోలు చేయడంపై పాక్ నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

India Touch at Maryam Nawaz Son Wedding Sparks Massive Controversy in Pakistan

మరియమ్ నవాజ్ కూడా 'ఇండియన్' వైపే..
కేవలం కోడలు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి మరియమ్ నవాజ్ కూడా భారతీయ డిజైనర్ దుస్తులనే ఎంచుకున్నారు. ఆమె మెహందీ వేడుక కోసం భారత డిజైనర్ అభినవ్ మిశ్రా రూపొందించిన పౌడర్-బ్లూ కలర్ లెహంగాను ధరించారు. దీని ధర పాకిస్థానీ కరెన్సీలో సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

సోషల్ మీడియాలో 'దేశద్రోహి' సెగ
పాకిస్థానీ నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షరీఫ్ కుటుంబంపై విరుచుకుపడుతున్నారు. "పాకిస్థాన్‌పై దాడి చేసి, మన సైనికులను చంపిన వ్యక్తి కుమారుడి బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తారా? పీఎంఎల్-ఎన్ పార్టీ పాకిస్థాన్‌కు అతిపెద్ద శత్రువు. వీరంతా దేశద్రోహులు" అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బ్రాండ్లు ఉన్నా, కావాలని భారతీయ బ్రాండ్లనే ఎంచుకోవడంపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+