బాస్ కూతురికి వేధింపు, భారతీయుడికి ఫైన్, దేశం విడిచి వెళ్లాలని..
సిడ్నీ: భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఆస్ట్రేలియాలో బాస్ కూతురు పైన వేధింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో, అతనిని దేశం నుంచి వెళ్లిపోమని చెప్పడంతో పాటు 2 వేల డాలర్ల జరిమానా విధించారని తెలుస్తోంది.
సమాచారం మేరకు... బాస్ కూతురుని ఫోన్ కాల్స్, సందేశాలు, వాయిస్ సందేశాలతో వేధించినందుకు భారత సంతతికి చెందిన ఇంజినీర్ అభినవ్‌కు జరిమానా విధించారు. కెనడా పాస్‌పోర్టు ఉన్న అభినవ్.. తన ఆఫీసులో పని చేసే బాస్ కూతురుకు వందలాది సందేశాలు, ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు పంపించేవాడు.
ఎన్నికార్లు హెచ్చరించినా అతడు పెడచెవిన పెట్టాడు. తాను ఆమెను ప్రేమిస్తున్నానని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పే హక్కు తనకు ఉందని చెప్పాడు. అయితే, ఇప్పుడు తనకు జరిమానా విధించడంతో... తాను అధికారికంగా యుద్ధం ప్రకటిస్తున్నానని, ఎలాగైనా ఆమె ప్రేమను పొందుతానని చెబుతున్నాడు.

ఆమె ఎప్పుడూ అభినవ్ మీద ప్రేమ ఉన్నట్లు చెప్పలేదని, అయినా ఆఫీసు రికార్డులు గాలించి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని వేధించాడని ఆరోపిస్తున్నారు. అనంతరం అభినవ్‌ను ఇమ్మిగ్రేషన్ శాఖ, బోర్డర్ ప్రొటెక్షన్ శాఖలు అరెస్టు చేశాయి.
అతడి వల్ల డాక్టర్‌గా పని చేసే భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఇబ్బందుల్లో పడ్డారని డిఫెన్స్ న్యాయవాది చెప్పారు. కాగా, అభినవ్ వయస్సు 33. అతను తప్పు చేసినట్లు గ్లాడ్ స్టోన్ మెజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. అభినవ్ జూలై 14వ తేదీ నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు ఆమెను ఫోన్ ద్వారా వేధించాడు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications