వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెనడాలో శ్రమ దోపిడీ-అవసరం తీరాక తరిమేస్తున్న వైనం-భారతీయ విద్యార్ధుల ఆవేదన

|
Google Oneindia TeluguNews

కెనడాకు ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయ విద్యార్దులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కరోనా తర్వాత మారిన పరిస్దితుల్లో వారిని అక్కడి ఉద్యోగాల నుంచి తొలగించి ఏకంగా దేశం నుంచి తరిమేస్తున్న పరిస్దితులు కనిపిస్తున్నాయి. దీనిపై అక్కడికి ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కెనడాకు వెళ్లిన విదేశీ విద్యార్థులు అక్కడి ప్రభుత్వం వారిని శ్రమ వనరుగా ఉపయోగించుకుందని, ఇప్పుడు అవసరం లేదంటోందని ఆరోపిస్తున్నారు. గతేడాది కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సుమారు 50 వేల మంది విదేశీ విద్యార్థులను గ్రాడ్యుయేషన్ తర్వాత 18 నెలల పాటు ఉద్యోగాలు వెతుక్కోవడానికి అనుమతించింది. కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న సమయంలో కంపెనీలు వీరిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు పరిస్దితుల్లో మార్పు కనిపిస్తోంది. కంపెనీలు వీరిని ఉద్యోగాల్లో కొనసాగించడానికి ఇష్టపడటం లేదు.

 indian students alleged canadian government for exploitation and discarding after use

కెనడా ఆర్ధిక వ్యవస్ధ పుంజుకుంటున్న క్రమంలో కంపెనీలు భారత్ సహా పలు విదేశీ విద్యార్ధుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం కూడా దేశంలో ఉండేందుకు అనుమతించడం లేదు. దీంతో వారు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్దితి తలెత్తుతోంది. ఒకప్పుడు చౌకగా దొరకడంతో వీరి సేవల్ని వాడుకున్న ప్రభుత్వం, కంపెనీలు ఇప్పుడు వారిని తొలగించడంతో తిరిగి భారత్ తిరిగి రావాల్సిన పరిస్దితి నెలకొంటోంది. అయితే దేశంలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి ప్రోత్సహించే మార్గాలను పరిశీలిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ తెలిపారు. విదేశీ విద్యార్థులు తీసుకువచ్చే "అద్భుతమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం గుర్తిస్తుందని ఆయన ప్రతినిధి జెఫ్రీ మెక్‌డొనాల్డ్ మెయిల్ ప్రకటనలో తెలిపారు.

వృద్ధాప్య శ్రామిక శక్తిని భర్తీ చేయడానికి రాబోయే మూడేళ్లలో రికార్డు సంఖ్యలో కొత్త వలసదారులను స్వాగతించాలని యోచిస్తున్న ప్రధాన మంత్రి ట్రూడో ప్రభుత్వం టొరంటోలో తాజా లక్ష్యాలను ప్రకటించనుంది. "ఈ పబ్లిక్ పాలసీల నుండి లబ్ది పొందుతున్న వారికి ఇలాంటి లేదా అనేక సందర్భాల్లో, కరోనాకు ముందు గ్రాడ్యుయేట్‌లు కలిగి ఉన్న నైపుణ్యం కలిగిన పని అనుభవాన్ని పొందేందుకు ఎక్కువ అవకాశం కల్పిస్తున్నారు" అని మెక్‌డొనాల్డ్ చెప్పారు.

English summary
indian students gone for jobs in canada have alleged that the local govt has exploited them after using their services during covid 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X