ఇరాక్ లో మరో అంతర్యుద్ధం-షియా వర్గాల మధ్య ఘర్షణలతో- ఇరాన్ పెడుతున్న చిచ్చు

ఆరుదశాబ్దాలకు పైగా రక్తపాతంతో తడిసి ముద్దయిన ఇరాక్ మరోసారి అంతర్యుద్ధం బారిన పడుతోంది. దేశంలోని రెండు మెజారిటీ షియా గ్రూపుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుతో అంతర్యుద్ధం తరహా పరిస్ధితులు నెలకొంటున్నాయి. దీంతో నిన్నటి నుంచి బాగ్ధాద్ మొత్తం కర్ఫ్యూ విధించారు. దీనికి ప్రధాన కారణం మొక్తదా అల్ సదర్ గ్రూప్ కూ, మాజీ ప్రధాని నౌరీ అల్ మాలికీ గ్రూపుకూ మధ్య సాగుతున్న పోరే.

గతేడాది అక్టోబరులో ఇరాక్ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత అధికారం కోసం రెండు మెజారిటీ షియా గ్రూపుల మధ్య మొదలైన పోరాటం ఇప్పుడు అంతర్యుద్దంగా మారుతోంది. ఇందులో ఓ గ్రూపు మొక్తాదా అల్-సదర్ నియంత్రణలో ఉండగా, ఇరాన్ మద్దతు ఉన్న మరొకటి మాజీ ప్రధాని నౌరీ ఎ-మాలికీ నియంత్రణలో ఉంది. అయితే ప్రస్తుత సంక్షోభానికి కేంద్ర బిందువు మాత్రం మొక్తాదా-అల్-సదర్. 2021 ఎన్నికల తర్వాత బాగ్దాద్‌లో అధికారంపై చర్చలు విఫలమైన తర్వాత ఈ పోరు ప్రారంభమైంది. మొక్తాదా-అల్-సదర్ నిన్న తన రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించాడు. వెంటనే అతని మద్దతుదారులు బాగ్దాద్‌లోని "గ్రీన్ జోన్"పై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేసి ప్రభుత్వ ప్యాలెస్‌ను ఆక్రమించారు. సైనిక చర్యలో అనేక మంది మరణించారు. ఒక రోజు తర్వాత, కర్బలా, బాసర, బాసరలోని ఉమ్ కస్ర్ పోర్ట్‌కి ఆనుకుని ఉన్న ప్రాంతాలకు హింస విస్తరించింది. దీంతో ఇరాక్‌లోని ఏకైక లోతైన నీటి నౌకాశ్రయానికి అన్ని మార్గాలూ మూసుకుపోయాయి.

iraq has been pushed into another civil war with these reasons

ఇరాక్‌లో ఇటీవలి పార్లమెంటరీ ఎన్నికల తర్వాత, సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అతను ఏకాభిప్రాయం సాధించలేకపోయాడు. దీంతో ఇప్పటి వరకు పాత తాత్కాలిక ప్రభుత్వం అతని సహకారం ఉన్న ముస్తఫా అల్-కదిమి ఆధ్వర్యంలో పనిచేస్తోంది. అదే సమయంలో ఇరాన్ మద్దతు ఉన్న సంకీర్ణం బలపడుతుండగా.. ప్రతిపక్షం అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని ఊహించి మొక్తాదా-అల్-సదర్ తాజా ఎన్నికలను డిమాండ్ చేశారు. అలాగే అంతర్యుద్ధం పేరుతో బెదిరింపులకు దిగుతున్నాడు.

యూఎస్ వ్యతిరేకి అయిన మొక్తాదా-అల్-సదర్.. మొదటి గల్ఫ్ యుద్ధం నుండి వాషింగ్టన్‌కు వ్యతిరేకంగా ఉన్నాడు. షియా ఆధిపత్యం కల ఇరాన్, సున్నీ ఆధిపత్య సౌదీ అరేబియా మధ్య ఇరాక్ మధ్యవర్తిగా వ్యవహరించగలదనే వాస్తవాన్ని అతను సమర్ధిస్తున్నాడు. ఇది అమెరికన్ ఆధిపత్యానికి గండి కొడుతోంది. ఈ నేపథ్యంలో సాయుధ డ్రోన్ 2019 సెప్టెంబర్ 7 న బాగ్దాద్‌లోని అతని ఇంటిని లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటన నుంచి ఆతను బయటపడ్డాడు.

ఈ సంఘటనలన్నింటి తర్వాత, ప్రస్తుత సంఘటనలు ఇరాన్‌చే ప్రభావితమైన ఇరాక్‌లో షియా ఆధిపత్య ప్రభుత్వానికి దారి తీయవచ్చని మొక్తాదా-అల్ సదర్ భావిస్తున్నాడు . దీన్ని నివారించాలనుకుంటున్న సదర్..మాజీ ప్రధాని నౌరీ అల్-మాలికీ నేతృత్వంలోని సంకీర్ణం బలపడకుండా అడ్డుపడుతున్నాడు. అయితే ఇరాన్ మద్దతు ఉన్న బ్లాక్ మరింత బలపడుతూనే ఉంది. ఈ బ్లాక్ నియంత్రణలో ఉన్న మిలీషియా కూడా ఆయుధాలతో బలంగా కనిపిస్తోంది. వారికి భారీ ఆయుధాలు, ఫిరంగిదళాలు మరియు సాయుధ డ్రోన్‌ల ద్వారా ఇరాన్ సరఫరా చేస్తుంది. ఇది అల్-సదర్ ముందు ఒకే ఒక ఆప్షన్‌ను మాత్రమే మిగిల్చింది. అది దేశంలో తన మద్దతుదారులను అంతర్యుద్ధానికి పురికొల్పడం. అలాగే తాజా ఎన్నికల దిశగా దేశాన్ని నడిపించడం. కానీ అలా జరగకుండా మాలికీ వర్గం అడ్డుకోవడంతో హింస చెలరేగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+