వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron:కరోనా వచ్చిన వారికే ముప్పు ఎక్కువ:WHO, వేగంగా వ్యాప్తి: అమెరికా సైంటిస్ట్

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ గజ గజ లాడిస్తోంది. దీంతో దాని ఉధృతి నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు ఫోకస్ చేశారు. ఇన్నాళ్లు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని భావించగా.. ఇప్పుడు ఒమిక్రాన్ ఎదుర్కొవడంపై ఫోకస్ చేశారు. అయితే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందా..? అదీ ఎలా స్ప్రెడ్ అవుతుందనే విషయం ఇంకా తెలియరాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కానీ ఇన్ పెక్షన్ ఎక్కువే ఉంటుందని మాత్రం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒమిక్రాన్ వేరియంట్‌పై పోరాడే శక్తి ఉంటుందని తెలియజేసింది.

వారికి ముప్పు ఎక్కువ

వారికి ముప్పు ఎక్కువ

ఇదివరకు కరోనా సోకిన వారికి వేగంగా ఒమిక్రాన్ సోకే ప్రమాదం ఉందనే సంచలన విషయాన్ని డబ్య్లూహెచ్‌వో తెలియజేసింది. ఇతర వేరియంట్ కన్నా ఒమిక్రాన్ సోకితే వేరుగా లక్షణాలు ఉంటాయనే అంశానికి సంబంధించి తెలియరాలేదు. ఒమిక్రాన్‌ ఎదుర్కొవాలంటే టీకా ఒక్కటే మార్గమని.. అలాగే మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించింది.

అమెరికా సైంటిస్ట్ ఇలా

అమెరికా సైంటిస్ట్ ఇలా

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెర్షన్ ఇలా ఉంటే.. అమెరికా టాప్ సైంటిస్ట్ ఒకరు వైరస్ గురించి కొత్త విషయం తెలియజేశారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అమెరికా అధ్యక్షుడి మెడికల్ అడ్వైజర్ అంటోని ఫౌసి తెలిపారు. దీంతో అమెరికన్లు వ్యాక్సిన్, బూస్టర్ డోస్ కంపల్సరీగా తీసుకోవాలని సూచించారు. ఇన్ పెక్షన్ గురించి సమాచారం అందుతున్న క్రమంలో.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు.

వేగంగా పరివర్తనం..

వేగంగా పరివర్తనం..

ఇటు మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ వివిధ మ్యూటెంట్లను పరివర్తనం చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదివరకు ఇలాంటి కాంబినేషన్ చూడలేమని వారు వివరించారు. ప్రొటీన్‌కు సంబంధించి 30 మ్యూటెషన్స్ ఉన్నాయి. కొత్త వేరియంట్‌ను బీటాతో పోల్చలేమని వివరించారు. ఇమ్యూనిటీ ఉన్నవారు.. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బరి నుంచి తప్పించుకోవచ్చు అని తెలిపారు. దీనికి సంబంధించి రెండు విధాలుగా స్టడీ చేశామన్నారు. ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ కొత్త వేరియంట్‌ను ఎదుర్కొగలవా అని ప్రశ్నిస్తే.. కచ్చితంగా తెలియదు అని సైంటిస్ట్ తెలిపారు. కానీ పౌష్టికాహారం తీసుకొని.. జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేశారు.

 ఇలా వెళుతుందట..

ఇలా వెళుతుందట..

కొత్త వేరియంట్‌ను ఒమ్రికాన్ అని పిలుస్తున్నారు. 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి.

ఇంకొంచెం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని ఒక రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు.

English summary
World Health Organisation has said it is still not clear if the Omicron variant of coronavirus is more transmissible or if it causes more severe disease than the other known variants
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X