వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యుత్తమ విద్యను అందించే దేశాన్ని సెలెక్ట్ చేసుకోవడం బిగ్ ఛాలెంజ్: సమాధానం ఇదే..!!

|
Google Oneindia TeluguNews

లండన్: ఏ దేశం అత్యుత్తమ విద్యను అందిస్తుందనేది ఉన్నత చదువులను అభ్యసించాలనుకునే ప్రతి విద్యార్థి ఎదుర్కొనే సమస్య. ఈ విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుంటారు స్టూడెంట్స్. కన్సల్టెన్సీలు ఇచ్చే సలహాల మీద ఎక్కువ శాతం ఆధారపడుతుంటారు. తమ ఆశయాలకు అనుగుణంగా బెస్ట్ ఎడ్యుకేషన్‌ను అందించే విదేశీ గమ్యస్థానాన్ని ఎలా ఎంచుకుంటారనేది గందరగోళానికి గురి చేస్తుంటుంది. అలాంటి సమయంలో ఎక్కువ మంది సూచించే దేశం- యునైటెడ్ కింగ్‌డమ్.

ఉన్నత చదువుల కోసం..

ఉన్నత చదువుల కోసం..

విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల తొలుత- తమకు ఏ సబ్జెక్ట్‌లో ఆసక్తి ఉందనే విషయంపై ఓ స్పష్టతకు రావాల్సి ఉంటుంది. టెక్నాలజీ లేదా సంప్రదాయబద్ధమైన సబ్జెక్ట్స్ అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్, లైఫ్ సైన్సెస్ అండ్ మెడిసిన్, సోషల్ సైన్స్, మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ వంటి వాటిల్లో ఏది చదవాలనే దాని మీద యూనివర్శిటీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చదవదలచుకున్న కోర్స్ మీద స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే విద్యార్థులు తమ ఆశయాలు, లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి వీలు ఉంటుంది.

స్కాలర్‌షిప్‌లు

స్కాలర్‌షిప్‌లు

స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అభ్యసించాలని భావించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని నెరవేర్చుకోలేకోవచ్చు. కొన్నేళ్లుగా విదేశాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది. అక్కడి యూనివర్శిటీల ట్యూషన్ ఫీజులు పెరిగాయి. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయ పడటానికి సరైన స్కాలర్‌షిప్‌లను ఇచ్చే యూనివర్శిటీలను గుర్తించాల్సి ఉంటుంది.

యూకే చదువుకోవడం మంచిదా?

యూకే చదువుకోవడం మంచిదా?

విదేశీ విద్యను అభ్యసించాలనుకునే చాలామంది భారతీయ విద్యార్థులు యూకే వైపు మొగ్గు చూపుతుంటారు. అత్యుత్తమ విద్యను అందించే దేశంగా యుకే భారతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా మారింది. యూకేలో చదువుకోవడానికి ఉత్తమమైన గమ్యస్థానంగా ఉందో లేదో నిర్ణయించేటప్పుడు పరిగణించవలసిన కొన్ని ఉపయోగకరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి సంస్కృతి, కాస్ట్ ఆఫ్ లివింగ్, అధిక సంఖ్యలో వలసలు, అక్కడ పెరుగుతున్న మల్టీ నేషనల్ కల్చరల్.. వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

యూకేలోని టాప్ 5 విశ్వవిద్యాలయాలు ఏవి?

యూకేలోని టాప్ 5 విశ్వవిద్యాలయాలు ఏవి?

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ: ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, లైఫ్ సైన్సెస్, మెడిసిన్, సోషల్ సైన్సెన్స్, మేనేజ్‌మెంట్, నేచురల్ సైన్స్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నాణ్యమైన విద్యను అందిస్తోంది.

కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ: ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, మెడిసిన్, నేచురల్ సైన్స్, సోషల్ సైన్సెన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఈ యూనివర్శిటీ నాణ్యమైన విద్యను అందిస్తోంది.

ఇంపీరియల్ కాలేజ్ లండన్: సైన్స్, ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మెడిసిన్‌లో ఇంపీరియల్ కాలేజ్ లండన్ మంచి విద్యను అందిస్తోంది.

యూనివర్సిటీ కాలేజ్ లండన్: ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చర్, ఆర్కియాలజీ, ఆంధ్రోపాలజీ, లైఫ్ సైన్సెస్, మెడిసిన్, డెంటిస్ట్రీ కోర్సుల్లో మంచి బోధనను అందించడంలో యూనివర్సిటీ కాలేజ్ లండన్ టాప్‌లో ఉంది.

యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్: ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, మెడిసిన్, వెటరినరీ మెడిసిన్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్, అంతరిక్ష టెక్నాలజీలో ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీకి మంచి పేరుంది.

గ్రాడ్యుయేషన్ తరువాత..

కోర్స్ పూర్తయిన తరువాత విద్యార్థులు యూకే గ్రాడ్యుయేట్ విసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూకేలో రెండేళ్ల వరకు నివసించడానికి, పని చేయడానికి ఈ విసా ఉపయోగపడుతుంది. ఈ రెండేళ్ల తరువాత ఈ విసాను పొడిగించే వీలు ఉండదు. రెగ్యులర్ అప్‌డేట్‌ కోసం ఇప్పుడే Edudha కమ్యూనిటీలో చేరండి.

English summary
Is UK the best Study Abroad Destination for the Indian Students?. Here is the details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X