వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరమంతటా బాంబులు.. మాటు వేసిన ఆత్మాహుతి దళ సభ్యులు

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పలాయనం చిత్తగిస్తూ కూడా సిరియా ప్రముఖ వారసత్వ నగరం పామిరా చుట్టుపక్కల లాండ్ మైన్స్ అమర్చి వెళ్లినట్లు సమాచారం.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీరుట్: ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ తోకముడిచింది. సిరియా ప్రముఖ వారసత్వ నగరం పామిరాను రాత్రికి రాత్రే ఖాళీ చేసింది. ఇప్పటికే రష్యా బలగాలతో ఉమ్మడిగా సిరియా సేనలు పామిరా ప్రాంతం సమీపానికి చేరుకున్నాయి.

దీంతో ఆ ప్రాంతంలో తలదాచుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, అక్కడి నివాసాలను స్వాధీనం చేసుకుని ఉన్న వారందరూ అర్థరాత్రి సమయంలోనే అక్కడి నుంచి తరలి వెళ్లిపోయినట్లు సిరియా హక్కుల సంస్థ ఒకటి పేర్కొంది.

అయితే ఉగ్రవాదులు పలాయనం చిత్తగిస్తూ కూడా ఆ నగరం చుట్టుపక్కల లాండ్ మైన్స్ అమర్చి వెళ్లినట్లు సమాచారం. సంకీర్ణ సేనలు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగే ప్రమాదం లేకపోలేదు.

ISIS Withdraws From Syria's Heritage Site Of Palmyra

అంతేకాకుండా.. కొంతమంది ఆత్మాహుతి దళ సభ్యులను కూడా ఇస్లామిక్ స్టేట్ ఆ నగరంలో విడిచిపెట్టి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు నేరుగా పామిరా నగరంలోకి ప్రవేశించకుండా ఆచి తూచి అడుగేస్తున్నాయి.

ఇప్పటికే ప్రాచీన నగరమైన పామిరా పలుమార్లు బాంబు దాడుల కారణంగా పలు వారసత్వ కట్టడాలను కోల్పోయింది. తాజాగా, మరోసారి ఉగ్రవాదులు లాండ్ మైన్లను అమర్చి వెళ్లడంతో ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందో తెలియని పరిస్థితి.

English summary
BEIRUT: Terror group ISIS withdrew from much of the Syrian oasis city of Palmyra overnight, a monitor said today, but government forces paused before entering its ravaged ancient ruins because of mines. Russian-backed Syrian troops pushed into a western neighbourhood of the city on Wednesday after fierce clashes with the terrorists. By morning, ISIS had withdrawn to residential neighbourhoods in the east of the city, the Syrian Observatory for Human Rights said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X