వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా, ఆస్ట్రేలియా సైట్స్ హ్యాక్ చేసిన ఐఎస్ఐఎస్

|
Google Oneindia TeluguNews

మెల్ బోర్న్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు పెద్ద షాక్ ఇచ్చారు. రెండు దేశాలలోని రక్షణ, ప్రభుత్వ రంగాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు, ఎంపీల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేశారు.

మొత్తం 1,400 మంది వివరాలు తమ దగ్గర ఉన్నాయని త్వరలోనే వారికి తగిన బుద్ది చెబుతామని బుధవారం ఐఎస్ఐఎస్ ఒక ప్రకటన విడుదల చేసిందని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక తెలిపింది. ఈ విషయంపై సీఎన్ఎన్ న్యూస్ చానెల్ పూర్తి వివరాలను వెల్లడించింది.

ఐఎస్ఐఎస్ హ్యాక్ చేసిన వారి లిస్ట్ లో ఎక్కువ మంది అమెరికా వారే ఉన్నారని రెండు దేశాల మీడియా వెల్లడించింది. 1,400 మంది అధికారులు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు తాము సేకరించామని చెప్పారు.

 Islamic State militants Hacking America, Australia Sites

వారి కదలికలన్నీ ఎప్పటికప్పుడు మేం గమనిస్తున్నామని, వారు వాడుతున్న సామాజిక మాధ్యమాల్లో తమ సభ్యులు ఉన్నారని, వారి వ్యక్తిగత సమాచారం సేకరించామని, త్వరలో తమ ఐఎస్ సభ్యులు వారిని వారి దేశంలోనే అంతం చేస్తారుని వార్నింగ్ ఇచ్చారు.

ఐఎస్ఐఎస్ హ్యాక్ చిసిన వారి లిస్ట్ లో విక్టోరియా ఎంపీ ఉన్నారు. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశానని, తమ కుటుంబ సభ్యులకు పూర్తి రక్షణ కల్పించాలని మనవి చేశామని ఎంపీ వెల్లడించారు. రెండు దేశాల ఉద్యోగుల పేర్లు, వారి ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్లు,ఈ-మెయిల్ అడ్రస్ లు సైతం ఆన్ లైన్ లో పెట్టిందని మీడియా వెల్లడించింది.

ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అదే విధంగా సరికోత్త టెక్నాలజీతో ఉగ్రవాదులు ముందుకు వెలుతున్నారు. ఐఎస్ఐఎస్ ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా దేశాలను టార్గెట్ చేసుకునిందని స్వయంగా ఉగ్రవాదులే అంగీకరించారు.

English summary
A group calling itself the Islamic State Hacking Division this week posted online a purported list of names and contacts for Americans it refers to as "targets," according to officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X