Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్‌కే షాకిచ్చిన మహిళా జడ్జి, ఒబామా నియమించారు: ఎవరీమే..?

ఏడు ముస్లీం దేశాల నుంచి ముస్లీంలు అమెరికాలో అడుగు పెట్టకుండా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను ఓ మహిళా జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు.

వాషింగ్టన్: ఏడు ముస్లీం దేశాల నుంచి ముస్లీంలు అమెరికాలో అడుగు పెట్టకుండా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను ఓ మహిళా జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. తద్వారా ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసారు.

ఆమెనె ఫెడరల్ జడ్జి యాన్ డోనెల్లీ. న్యాయ శాస్త్రంలో మంచి అనుభవం ఉన్న ఆమెను 2015లో హైప్రొఫైల్ డెమోక్రటిక్ సెనేటర్ చార్లెస్ షుమర్ సలహా పైన నాటి అధ్యక్షులు బరాక్ ఒబామా ఫెడరల్ జడ్జిగా జడ్జిగా నియమించారు.

 Judge Ann Donnelly: 5 Fast Facts You Need to Know

డొనెల్లీకి.. షూమర్ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిలో షూమర్ కూడా ఒకరు.

మిచిగాన్‌లోని రాయల్ ఓక్ ప్రాంతానికి చెందిన డోనెల్లీ న్యాటర్ డ్యాం యూనివర్సిటి నుంచి గ్రాడ్యుయేషన్, ఓహియో కాలేజీ నుంచి లా పట్టా అందుకున్నారు. ఆ తర్వాత పదేళ్ల పాటు రైట్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేశారు.

ఫెడరల్ జడ్జి కావడానికి ముందు డొనెల్లీ రెండున్నర దశాబ్దాల పాటు న్యూయార్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. ఆ సమయంలో గృహహింస, బాలలపై నేరాలు విచారణ విభాగంలో బ్యూరో చీఫ్‌గా కూడా విధులు నిర్వర్తించారు.

న్యూయార్క్‌ న్యాయస్థానంలో క్లెయిమ్‌ల విభాగంలో న్యాయమూర్తిగా పని చేశారు. 2015లో హైప్రొఫైల్‌ డెమక్రాటిక్‌ సెనెటర్‌ చార్లెస్‌ షూమర్ సలహా మేరకు యాన్ డొనెల్లీని నాటి అధ్యక్షుడు ఒబామా ఫెడరల్‌ జడ్జిగా నియమించారు.

ఆమె నియామకాన్ని అప్పటి సెనెట్‌ 95-2ఓట్ల తేడాతో ఆమెదించింది. అప్పట్లో షూమర్ ఆమెను నీతివంతురాలు, ఓపెన్‌ మైండెడ్‌ అని అభివర్ణించారు. షూమర్, డొనెల్లీ కుటుంబ స్నేహితులు. వారి కుమార్తులు మంచి మిత్రులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+