Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

15 గంటలపాటు మంచినీళ్ళు, ఆహారం లేకుండా చిత్రహింసలు పెట్టాడు, భార్య ఏంచేసిందంటే

శాడిస్టు భర్త నుండి భార్య , కొడుకును ఓ కొరియర్ బోయ్ రక్షించాడు. 15 గంటలపాటు మంచినీళ్ళు, ఆహరం లేకుండా 15 గంటలపాటు హింసించిన భర్తను కొరియర్ బోయ్ రక్షించారు. కొరియర్ బోయ్ ను స్థానికులు హీరోగా భావిస్తున్

అమెరికా :శాడిస్టు భర్త నుండి భార్యను ఆమె కొడుకు కొరియర్ బోయ్ రక్షించాడు. కొరియర్ బోయ్ రాకపోతే వీరిద్దరూ కూడ అతడి చేతిలో మరణించేవారే. శాడిస్టు భర్త చేతిలో బందీగా ఉన్న భార్య ఇచ్చిన సంకేతం ఆదారంగా కొరియర్ బోయ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శాడిస్టు భర్త నుండి పోలీసులు వారిని రక్షించారు.ఈ ఘటన అమెరికాలోని మిస్సోరిలో చోటుచేసుకొంది.

lucky escape, corier boy save wife and son from husband

15 గంటలుగా చిత్రహింసలు పెట్టాడు

జేమ్స్ జోర్డాన్ అనే వ్యక్తి శాడిస్టుగా మారాడు. తన భార్యను, కొడుకును 15 గంటలపాటు రూమ్ లో బందించాడు . కనీసం మంచినీళ్ళు కూడ తాగేందుకు నిరాకరించాడు. భార్యను చిత్రహింసలు పెట్టాడు. మూడేళ్ళ కొడుకును కూడ మరో గదిలో బంధించాడు. పదిహేను గంటలపాటు కనీసం మంచినీళ్ళు కూడ కొడుకుకు ఇవ్వలేదు. భార్యను విపరీతంగా కొట్టాడు. లైంగికంగా వేధించాడు. ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందో తెలియదు. కాని , ఆమెను విపరీతంగా కొట్టాడు. ఆమెను చంపి తాను కూడ చనిపోతానని హెచ్చరించాడు. ఆమె తలకు తుపాకీ పెట్టి కాల్చిచంపుతానని బెదిరించాడు.ఇంటి నుండి బయటకు పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఆమెపై విరుచుకుపడ్డాడు

అమెరికా దేశంలోని మిస్సోరి రాష్ట్రంలోని ఫ్రాంక్లీస్ కౌంటీలో చోటుచేసుకొంది. పదిహెను గంటలపాటు జేమ్స్ జోర్డాన్ అనే వ్యక్తి తన భార్య కొడుకును చిత్రహింసలు పెట్టాడు.శాడిస్టుగా అతను ప్రవర్తించడంతో బతికే అవకాశాలు లేవని వారు భావించారు. వేధించి చిత్రహింసలు పెట్టి చంపుతానని బెదిరించాడు.. బెదిరించినట్టుగానే తన ప్రణాళికను అమలు చేశాడు.

కొరియర్ బోయ్ రక్షించాడు

శాడిస్టు భర్త నుండి భార్య , కొడుకును కొరియర్ బాయ్ రక్షించాడు. ఈ ఇంటి నుండి ఒ పార్శిల్ ను తీసుకెళ్ళేందుకు కొరియర్ బోయ్ వచ్చాడు. అయితే కొరియర్ బోయ్ కు పార్శిల్ ఇచ్చేందుకు భార్యను పంపాడు జెమ్స్ . అయితే ఆమె వెనుకే ఉండి కొరియర్ బాయ్ కు కన్పించకుండా ఆమె ను తుపాకీతో బెదిరించాడు.కొరియర్ బోయ్ రూపంలో తమకు అదృష్టం కలిసివచ్చిందని జేమ్స్ భార్య బావించారు. భర్తకు తెలియకుండా పార్శిల్ పై పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాశారు. కాల్ 911 నెంబర్ ను పార్శిల్ పై రాశారు.పార్శిల్ పై ఆమె రాసింది చూసిన కొరియర్ బోయ్ వెంటనే స్పందించాడు.

జేమ్స్ ఇ:టి నుండి పార్శిల్ ను తీసుకొని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ఈ సమాచారంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. జేమ్స్ చెరలో బందీగా ఉన్న భార్య , కొడుకును విడిపించారు. నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు కొరియర్ బోయ్ చూపిన చొరవ కారణంగా ఇద్దరి ప్రాణాలు దక్రించుకొన్నారు. ఈ ఘటనతో ఆ కొరియర్ బోయ్ ను స్థానికులు హీరోగా అభివర్ణిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+