ప్యాంటు విప్పి యువరాజ్ వీరంగం: రెస్టారెంట్ యజమానిని కాల్చిపారేస్తానని బెదిరింపులు..

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఓక్లాండ్‌లోని ఆల్ ఇండియా రెస్టారెంటులో యువరాజ్ శర్మ అనే ఓ భారతీయుడు సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భోజనంలో ఉల్లిపాయలు వేశారని ఒకసారి, తనకు సరిగా స్వాగతం పలకలేదని మరోసారి వారిపై విరుచుకుపడ్డాడు. నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు. దీంతో విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. యువరాజ్ శర్మ(43) ఇటీవల ఓక్లాండ్ రెస్టారెంటుకు వెళ్లాడు. భోజనం ఆర్డర్ చేసి తింటున్న సమయంలో.. అందులో ఉల్లిపాయలు కనిపించడంతో సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. ఆ మరునాడు  ఫుల్లుగా మద్యం సేవించి మళ్లీ రెస్టారెంటుకు వచ్చిన యువరాజ్.. మరోసారి సిబ్బందితో గొడవకు దిగాడు.

MAN PULLS HIS PANTS DOWN, WARNS TO SHOOT RESTAURANT OWNER FOR THE MOST BIZARRE REASON

తనకు సరిగా వెల్‌కమ్ చెప్పలేదని రెస్టారెంట్ యజమాని రవీందర్ సింగ్‌ను బూతులు తిట్టాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా యువరాజ్‌ను కోరగా.. కాల్చి పారేస్తానని యజమానిని బెదిరించాడు. దీంతో రవీందర్ సింగ్ పోలీసులకు ఫోన్ చేయగా.. 'ప్యాంటు విప్పేసి నగ్నంగా మారి' తిట్టడం మొదలుపెట్టాడు.

ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. యువరాజ్‌ను అరెస్టు చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. యువరాజ్ పీకలదాకా తాగాడని.. మద్యం మత్తులో బూతులు మాట్లాడాడని పోలీసులు తెలిపారు. దీనిపై స్పందించిన రెస్టారెంటు యజమాని.. తమది భారతీయ రెస్టారెంటు కాబట్టి.. తమవాడేనని తొలుత వెనక్కి తగ్గామని, కానీ కాల్చేపారేస్తానని బెదిరింపులకు దిగడంతో ఫిర్యాదు చేయక తప్పలేదని వివరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, an Indian-origin man reportedly removed his pants and threatened to shoot the staffers of an Indian restaurant in Oakland because they allegedly put onions in his food.
Please Wait while comments are loading...