పోర్ట్ భస్మీపటలం: భీతావహం
Bandar Abbas Port: ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకు ఎంతమంది మరణించారనేది తెలియరావట్లేదు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.
ఇరాన్‌లోనే అతిపెద్ద ఓడరేవు ఈ పోర్ట్ ఆఫ్ బందర్ అబ్బాస్. రాజధాని టెహ్రాన్‌కు దక్షిణ దిశగా దాదాపుగా 1,000 కిలోమీటర్ల దూరంలో హర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో ఉంటుంది. పోర్ట్‌లో ఉన్న సినా కంటైనర్ యార్డ్‌లో తాజాగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 500 మందికి తీవ్ర గాయాలైనట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ టాస్నిమ్ తెలిపింది.

గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, ఇరాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
ఇప్పటివరకు ప్రాణనష్టం సంభవించలేదని హర్మోజ్గాన్ ప్రావిన్స్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ మెహర్దద్ హసన్‌జదే తెలిపారు. గాయపడ్డ వారికి అత్యుత్తమ చికిత్సను అందిస్తోన్నట్లు చెప్పారు. ఈ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం- షహీద్ రాజీ పోర్ట్ వార్ఫ్ ప్రాంతంలో నిల్వ ఉంచిన కంటైనర్లే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
పేలుడు తీవ్రత భయానకంగా ఉంటోంది. పేలుడు సంభవించిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నికీలలు కంటైనర్ యార్డ్ మొత్తం వ్యాపించాయి. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం పాటు వినిపించింది. దట్టమైన పొగ పోర్ట్ మొత్తం అలముకుంది. పలు భవనాల కిటికీలు, పోర్ట్‌కు దూరంగా పార్క్ చేసి ఉంచిన వాహనాల అద్దాలు భళ్లుమంటూ పగిలిపోయాయి.
📹 خسارت سنگین انفجار در بندر شهید رجایی
— خبرگزاری تسنیم 🇮🇷 (@Tasnimnews_Fa) April 26, 2025
با اینکه نیروهای امدادی و امنیتی و اکنش سریع به محل انفجار در بندر شهید رجایی رسیدهاند و تلاش دارند تا اوضاع را کنترل کنند، اما هنوز بندر شهید رجایی در وضعیت آشفتهای به سر میبرد
تمام خودروها خسارت دیدهاند و به نوعی مچاله شدهاند https://t.co/4hzM2r9A2F pic.twitter.com/rpAEXUb5YC
సంఘటన స్థలం మొత్తం భీతావహ వాతావరణం నెలకొంది. బాధితుల హాహాకారాలు, అంబులెన్సుల మోతలతో మార్మోగిపోయింది. ఊపిరి పీల్చుకోవడానికి కష్టం అనిపించేంత ఘాటు పొగ ఆ ప్రాంతం మొత్తాన్నీ చుట్టుముట్టింది. గాయపడ్డ వారందరినీ పోర్ట్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.
📹 اختصاصی تسنیم | علت اصلی انفجار در بندر شهید رجایی مشخص شد
— خبرگزاری تسنیم 🇮🇷 (@Tasnimnews_Fa) April 26, 2025
خبرنگار تسنیم:
یک مخزن سوخت در بندر شهید رجایی به علت نامعلومی دچار انفجار شده و بلافاصله تیمهای واکنش سریع به منطقه اعزام شدهاند
هنوز اطلاع دقیقی از تعداد مجروحان و فوتیهای این انفجار در دست نیست https://t.co/BK3DwUnBIl pic.twitter.com/pfAUbRTNHq
-
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక! -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications