వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివ్వెరపోయే నిజం: పడక గదిలో పవర్‌ఫుల్‌గా ఉండాలంటే రోజూ వ్యాయామం తప్పనిసరి అట..!

|
Google Oneindia TeluguNews

శృంగారంపై ఎన్నో కొత్త పరిశోధనలు జరుగుతుంటాయి. చాలామంది వీటిని ఆసక్తికరంగా కూడా చదువుతారు. తాజాగా శృంగారంకు సంబంధించే ఓ కొత్త పరిశోధన బయటపడింది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే పురుషుల్లో సెక్స్ స్టామినా పెరుగుతుందని తాజా పరిశోధన తెలియజేసింది. బయట ఎలా ఉన్నప్పటికీ పడకగదిలో మాత్రం పవర్ చూపుతారని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు ఈ పరిశోదన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది.

రోజుకు 40 నిమిషాలు సైక్లింగ్ చేస్తే రతిక్రీడలో మీరే విజేతలు

రోజుకు 40 నిమిషాలు సైక్లింగ్ చేస్తే రతిక్రీడలో మీరే విజేతలు

వ్యాయామం చేసే పురుషుల్లో శృంగార సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పిన స్టడీ మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. రోజుకు 40 నిమిషాల పాటు సైక్లింగ్ చేసే పురుషులు రతిక్రీడలో సత్తాచాటుతారని స్టడీ వెల్లడించింది. అంతేకాదు రోజుకు 90 నిమిషాల పాటు చురుకుగా వాకింగ్ చేసేవారు శృంగారంలో చాలా ఎక్కువసేపు గడుపుతారని ఆ సామర్థ్యం వారికుంటుందని తెలిపింది. ఇక వారం మొత్తం కలిపి 30 నిమిషాలు వాకింగ్ చేసే మగవారిలో శృంగార సామర్థ్యత అంత ఉండదని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇక ఇలాంటి వారిలో శృంగార సమయం క్లైమాక్స్‌ కేవలం 20 సెకన్లు మాత్రమే ఉంటుందని పేర్కొంది.

నిత్యం కూర్చొనే పనిచేస్తున్నారా... అయితే అన్‌ఫిట్టే

నిత్యం కూర్చొనే పనిచేస్తున్నారా... అయితే అన్‌ఫిట్టే

నిత్యం కూర్చుని పనిచేసేవారు లేదా నిశ్చల జీవనశైలి పాటించే మగవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని స్టడీ హెచ్చరిస్తోంది. అలాంటి వారు తమ దాంపత్య జీవితాన్ని తమకు తాముగా ధ్వంసం చేసుకుంటున్నారని హెచ్చరించింది. వారిలో శృంగార సామర్థ్యం తగ్గడమే కాదు లైంగిక అసమర్థత, లేదా అకాల స్ఖలనం నుంచి బాధపడుతారని స్టడీ పేర్కొంది. అంతేకాదు ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరు శృంగార సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. దీని ద్వారా కాపురాలు కూలుతున్నాయని వెల్లడించింది.

పని ఒత్తిడి ఉన్నవారిలో అకాల స్ఖలనం

పని ఒత్తిడి ఉన్నవారిలో అకాల స్ఖలనం

శృంగారంలో పురుషుల సామర్ధ్యం పై స్టడీ చేశారు టర్కీలోని అంకారా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ వైద్యులు. వీరు 250 మంది పురుషుల సామర్థ్యాన్ని స్టడీ చేశారు. ఇందులో వ్యాయామం చేసే పురుషుల్లో శృంగార సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఆఫీసులకే పరిమితమై, పని ఒత్తిడితో కూరుకుపోయిన పురుషుల్లో అకాల స్ఖలనం జరుగుతోందని చెప్పారు. వ్యాయామం చేయని పురుషుల్లో శృంగార సామర్థ్యం అతి తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.

English summary
A new study now finds that men who exercise regularly have more stamina in the bedroom, lasting almost twice as long as a couch potato.The study further said that those who cycled for up to 40 minutes per day or jogged lasted an average of five minutes 30 seconds during coitus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X