గగనతలంలో అనూహ్య ఘటన: విమానం ప్రమాదంలో ఒక మహిళ మృతి
ఫిలడెల్ఫియా: డల్లాస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం-1380 అనుకోని ప్రమాదానికి గురైంది. సాంకేతిక కారణాలతో గగనతలంలోనే విమానం ఇంజన్ పేలిపోయింది. పేలిన ఇంజన్ శకలంలో విమానంలోకి దూసుకురావడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో విమానంలోని మిగతా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో.. ఇంజన్ నుంచి లీకైన గ్యాస్ విమానంలోకి వచ్చి చేరడంతో.. ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు. దీంతో అందరికీ ఆక్సిజన్ మాస్కులు అందించినప్పటికీ.. దురదృష్టవశాత్తు జెన్నిఫర్ అనే ఓ మహిళ మృతి చెందారు. న్యూ మెక్సికో గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. వెల్స్ ఫార్గో బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ గా గుర్తించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.
నా భర్త చేతిని గట్టిగా పట్టుకున్నా:
'ప్రమాద సమయంలో నా భర్త చేతిని గట్టిగా పట్టుకుని, మనసులోనే దేవున్ని ప్రార్థించాను. నా పిల్లలను మళ్లీ చూస్తానో లేదో అని కలవరపడ్డాను.' అని ఓ ప్రయాణికురాలు వెల్లడించారు.
కాగా, విమానం 30,000 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఇంజన్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో గ్యాస్ లీకైందని.. దానివల్లే ప్రయాణికులకు ఊపిరాడలేదని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications