"హోమోసెక్స్" వల్ల భూకంపాలు సంభవిస్తాయా..?
అక్రా : భూకంపాలను ఇన్నాళ్లూ ప్రకృతి వైపరీత్యాలు గానే పరిగణిస్తూ వస్తున్న ప్రపంచ దేశాలకు ఓ కొత్త భాష్యం చెప్పారు ఘనా దేశానికి చెందిన ఓ ముస్లిం మత పెద్ద. మనుషుల శారీరక సంబంధాలకు, భూకంపాలకు ముడిపెడుతూ వల్లే 'గే సెక్స్' వల్లే భూకంపాలు సంభవిస్తున్నాయని చెప్పారు.
దీని గురించి వివరణ ఇచ్చిన అబ్బాస్ మహ్మూద్ అనే ఆ మత పెద్ద.. గే సెక్స్ అనేది అల్లాను అవమానించే చర్య అని అందుకే భూకంపాలు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇద్దరు పురుషుల మధ్య లైంగిక సంబంధం అల్లాకు చిరాకు పుట్టించేదవుతుందని, దాని పర్యవసానంగానే భూకంపాలు వస్తాయని ఓ ఇంటర్వ్యూ లో భాగంగా పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. సొడోమ్, గొమొర్రా వంటి పురాతన నగరాల్లో స్వలింగ సంపర్కుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతోనే అల్లా ఆ నగరాలను ధ్వంసం చేశారన్నారు. హోమోసెక్సువల్స్ ఇడియట్స్ అందరినీ జోంగో వర్గం నుంచి తరిమికొట్టడమే మేలు అని చెప్పిన ఆయన, పవిత్ర ప్రబోధాలకు బద్ద వ్యతిరేకంగా ఇలా స్వలింగ సంపర్కులుగా మారేవారిని మన వర్గాల్లో కొనసాగించడం అవసరమా..? అంటూ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే, ఘనాలో కొంతకాలంగా స్వలింగ సంపర్కుల మీద దాడులు జరుగుతూ వస్తున్నాయి. రాజధాని అక్రాతో పాటు కుమాసి నగరంలోని కొంతమంది హోమో సెక్సువల్స్ మీద జోంగో వర్గం దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వలింగ సంపర్కం గురించి స్పందించిన అక్కడి ముస్లిం మత పెద్ద ఈ వ్యాఖ్యలు చేశారు.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఘనా దేశంలో, ప్రస్తుత దాడుల నేపథ్యంలో స్వలింగ సంపర్కులుగా కొనసాగుతోన్న కొంతమంది గే పురుషులు ఇళ్లు వదిలి పారిపోతున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications