వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగారకుడిపై రోబో తవ్వకాలు-చరిత్రలో తొలిసారి- రాళ్ల శాంపిల్స్ సేకరణలో తడబాటు

|
Google Oneindia TeluguNews

అంగారకుడిపై జీవరాశి మనుగడపై అధ్యయనాలు చేస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా చరిత్రలో తొలిసారిగా అరుణ గ్రహంపై రోబో సాయంతో తవ్వకాలు సాగిస్తోంది. అద్భుత రీతిలో సాగుతున్న ఈ తవ్వకాల్లో రోబో సాయం తీసుకుంటున్నారు. అయితే ఈ తవ్వకాల్లో రాతి శాంపిల్స్ సేకరణ మాత్రం సాధ్యం కావడం లేదు. అయితే త్వరలో ఈ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంగారకుడిపై రాతి శాంపిల్స్ ను మార్స్ సేకరించగలిగితే మాత్రం వాటిపై పరిశోధనలు చేయడం ద్వారా మానవ మనుగడకు ఉన్న అవకాశాలపై క్లూ దొరికే్ అవకాశముంది.

 అంగారకుడిపై అద్భుతాలు

అంగారకుడిపై అద్భుతాలు

ఎర్రటి ఛాయతో కనిపించే అరుణ గ్రహంపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా చేస్తున్న ప్రయోగాలు అబ్బుర పరిచేలా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ నాసా పర్ సీవరెన్స్ మార్స్ రోవర్ ను పంపడమే కాకుండా అక్కడ విజయవంతంగా ల్యాండ్ చేయగలిగింది. అలాగే రోవర్ తో పాటు పంపిన బుల్లి హెలికాఫ్టర్ సైతం అక్కడ చక్కర్లు కొట్టింది. అందులో ఉన్న డ్రోన్ కెమెరాతో ఈ అద్భుతాల్ని ఫొటోలు, వీడియోల రూపంలో భూమికి పంపుతోంది. వీటిని వివిధ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు విశ్లేషించే పనిలో ఉన్నారు. అదే సమయంలో నాసా తన బుర్రకు మరింత పదును పెడుతోంది.

 అరుణ గ్రహంపై తవ్వకాలు

అరుణ గ్రహంపై తవ్వకాలు

అంగారకుడిపైకి నాసా పంపిన మార్స్ పర్సీవరెన్స్ రోవర్ అక్కడ జీవరాసి మనుగడకు ఉన్న అవకాశాల్ని అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా అరుణ గ్రహంపై తవ్వకాలు చేపడుతోంది. అక్కడ రాతి, ఇసుక, ఇతర ఖనిజాల శాంపిల్స్ ను సేకరించడం ద్వారా వాటిని విశ్లేషించి మానవజాతి మనుగడను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో ఇప్పటికే అక్కడ ఉన్న ఏలియన్స్ జాతుల జాడల్ని కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉంది. దీంతో అరుణ గ్రహంపై మార్స్ రోవర్ చేస్తున్న తవ్వకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇందులో మానవ జాతి తెలుసుకోవాల్సిన పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

 చరిత్రలో తొలిసారి రోబో సాయంతో

చరిత్రలో తొలిసారి రోబో సాయంతో

చరిత్రలో తొలిసారిగా అంగారకుడిపై రోబో సాయంతో నాసా తవ్వకాలు చేపడుతోంది. మార్స్ రోవర్ తో పాటు పంపిన రోబోతో నిర్వహిస్తున్న ఈ తవ్వకాలు చూసేందుకే అద్భుతంగా ఉన్నాయి. ఎర్రటి అంగారకుడిపై మార్స్ రోవర్ రాయి, మట్టిని తవ్వుతున్న దృశ్యాలు కనువిందు చేసేలా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫోటోల్ని తాజాగా మార్స్ రోవర్ నాసాకు పంపింది. ఇప్పుడు నాసా వీటిని విశ్లేషించే పనిలో ఉంది. రోబోను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా అంతరిక్ష కేంద్రం నుంచే నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు వివరాలను తెప్పించుకుంటోంది. వీటి ఆధారంగా అక్కడ తవ్వకాలు ఎలా జరుగుతున్నాయో శాస్త్రవేత్తలు తెలుసుకునేందుకు వీలు కలుగుతోంది.

 శాంపిల్స్ సేకరణలో తడబాటు

శాంపిల్స్ సేకరణలో తడబాటు

అంగారకుడి ఉపరితలంపై ఉన్న రాతి, ఇసుక శాంపిల్స్ సేకరణకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మార్స్ రోవర్ తో అనుసంధానమైన రోబో తవ్వకాలు చేపడుతోంది. భూమి నుంచి ఈ రోబోను నియంత్రిస్తున్నారు. ఈ తవ్వకాల సంగతి బాగానే ఉన్నా వీటిలో శాంపిల్స్ సేకరణ మాత్రం కష్టసాధ్యంగా మారింది. భూమిపై తవ్వినంత సులువుగా అంగారకుడిగా తవ్వకాలు చేపట్టలేని పరిస్ధితితో పాటు శాంపిల్స్ సేకరణలోవాతావరణ ప్రభావం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అంగారకుడిపై రాతి శాంపిల్స్ సేకరణలో నాసా మార్స్ రోవర్ విఫలమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది విఫలమైనా భవిష్యత్తులో మాత్రం శాంపిల్స్ సేకరణ కచ్చితంగా జరుగుతుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 నాసా శాస్త్రవేత్తల్లో సడలని ధీమా

నాసా శాస్త్రవేత్తల్లో సడలని ధీమా

అంగారకుడిపైకి తాము పంపిన మార్స్ పర్సీవరెన్స్ రోవర్ అంచనాలకు మించి గొప్పగా ఫలితాలు అందిస్తున్న నేపథ్యంలో తాజాగా రాతి శాంపిల్స్ సేకరణలో వైఫల్యాన్ని నాసా అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రస్తుతానికి తవ్వకాలు అయితే సజావుగానే సాగుతున్నాయి కాబట్టి వీటి ఆధారంగా భవిష్యత్తులో అక్కడి రాతి శాంపిల్స్ సేకరించడం పెద్ద కష్టమేమీ కాదన్న భావనలో నాసా శాస్త్రవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో రోబో సాయంతోనే రాతి శాంపిల్స్ సేకరిస్తామని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే శాంపిల్స్ విశ్లేషణ ద్వారా అంగారకుడిపై మానవజాతి మనుగడకు సంబంధించి కీలక ఆధారం దొరికినట్లవుతుంది.

Recommended Video

Spl Interview With Telangana Rachayithala Sangam Chairman
 2030లో తీపికబురు వస్తుందా ?

2030లో తీపికబురు వస్తుందా ?

ప్రస్తుతానికి తాము పంపిన పర్ సీవరెన్స్ రోవర్ అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు సాధించడంపై సంతోషంగా ఉన్న నాసా వర్గాలు.. 2030 నాటికి ఇది భూమికి తిరిగి వచ్చేటప్పుడు కనీసం 30 శాంపిల్స్ తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ శాంపిల్స్ ఆధారంగా ఇప్పుడు రోవర్ దిగిన జెజీరో కార్టర్ ప్రాంతంలో 3.5 బిలియన్ సంవత్సరాల నాటి సరస్సు ఒకటి ఉందనే వాదనకు ఆధారాలు సేకరించాలని నాసా ప్రయత్నిస్తోంది. ఈ శాంపిల్స్ విశ్లేషణ చేయడం ద్వారా ఈ వాదనను నిరూపించ గలిగితే అక్కడ మానవజాతి మనుగడకు అవకాశాలు మెరుగుపడతాయని నాసా చెబుతోంది. అయితే ఇప్పుడు పంపిన మార్స్ రోవర్ తో పాటు మరిన్ని రోవర్లను పంపేందుకు నాసా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వీటన్నింటి సాయంతో అంగారకుడిపై నీటి జాడల్ని, రాయి, మట్టి శాంపిల్స్ ను తీసుకుని విశ్లేషణ చేయడం ద్వారా తొలిసారి అంగారకుడిపై మానవజాతి మనుగడకు దారులు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఈ లెక్కన 2030లో నాసా మానవాళికి ఈ తీపి కబురు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
nasa's perseverance mars rover has start digging into red planet and fails to collect rock samples.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X