శనివారం జన్మించిన రాయల్ బేబికి పేరు పెట్టిన ప్రిన్స్ విలియం దంపతులు
లండన్: ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతుల కుమార్తెకు నామరణం చేశారు. చిన్నారి పేరు 'ఛార్లెట్ ఎలిజిబెత్ డయానా'. శనివారం జన్మించిన పాపను ఇక నుంచి 'ప్రిన్సెస్ ఛార్లెట్ ఆఫ్ కేంబ్రిడ్జ్' అని పిలుస్తారు.
సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో చిన్నారి ప్రిన్సెస్ జన్మించిన రెండు రోజుల తర్వాత కెన్సింగ్‌టన్ ప్యాలెస్ నుంచి సోమవారం అధికారికంగా ప్రకటన వెలువడింది. బ్రిటన్ రాజసింహాసన వారసుల్లో ఈ చిన్నారి రాజకుమారిది నాల్గవ స్ధానం.
తాత ఛార్లెస్, తండ్రి విలియం, అన్న జార్జిల తర్వాత స్ధానం ప్రిన్సెస్ ఛార్లెట్‌దే కావడం విశేషం. తాత ఛార్లెస్, తాతమ్మ ఎలిజిబెత్ రాణి, నానమ్మ డయానా పేర్లను ప్రతిఫలించే విధంగా ఛార్లెట్ పేరు పెట్టినట్లు అనిపిస్తోంది.

ప్రిన్సెస్ ఛార్లెట్ పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని బ్రిటిష్ సైనికులు లండన్‌లోని టవర్ ఆఫ్ లండన్ వద్ద తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. ప్రిన్సెస్ ఛార్లెట్ కోసం రాయల్ ఆర్టిలరీ బ్రాండ్ మ్యూజిక్ ప్లే చేశారు.
శనివారం జన్మించిన ఈ చిన్నారిని ఆదివారం సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో తొలుత చూసిన వారిలో తాతా ఛార్లెస్, అతడి భార్య కెమిల్లా, అమ్మమ్మ కెరోల్, తాతయ్య ఛార్లెస్‌లు గంట సేపు చిన్నారితో గడిపారు.
ఇక బ్రిటిష్ ఎలిజిబెత్ రాణి మాత్రం ఈ వారం చివరలో మునిమనవరాలిని చూడటానికి రానున్నారు. ఇక చిన్నారి ప్రిన్సెస్ బాబాయ్ హ్యారీ ప్రస్తుతం ఆస్టేలియా టూర్‌లో ఉన్నారు. ప్రిన్సెస్ హ్యారీ మాట్లాడుతూ ప్రిన్సెస్ ఛార్లెట్ చాలా అందంగా ఉందని, ఆమె కలిసేందుకు వేచి చూడలేనని అన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications