శృంగారానికి నో!: ట్రంప్ గెలుపుతో పురుషులకు షాకిస్తున్న మహిళలు!!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంతో వేలాది మంది మహిళలు పురుషులకు షాకిస్తున్నారు. కమలా హారిస్ గెలుస్తారని అంతా భావించినప్పటికీ.. ట్రంప్ గెలవడంతో వారంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అంతేగాక, డొనాల్డ్ ట్రంప్ విజయానికి పురుషులే కారణమని వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు.
చాలా మంది మహిళలు.. పురుషులతో శృంగారం, డేటింగ్, పిల్లలను కనడం వంటి వాటికి దూరంగా ఉండాలని 4B ఉద్యమాన్ని ప్రారంభించారు. కాగా, ఎన్నికల సమయంలో కమలా హారిస్ ప్రచారం ట్రంప్‌ని స్రీవాద వ్యతిరేక వ్యక్తిగా చిత్రీకరించింది. అయినప్పటికీ.. డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో చాలా మంది మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ నేపథ్యంలోనే ట్రంప్ గెలుపునకు పురుషులే కారణమంటూ వారిపై సరికొత్త యుద్ధాన్ని ప్రకటించారు. 4B ఉద్యమంలో అనేక మంది మహిళలు చేరుతున్నారు. పురుషులతో ఎలాంటి శృంగారం చేయబోమని ఆ మహిళలంతా తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు ఇది అమెరికాలో ట్రెండ్ అవుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చాలా మంది మహిళలు తమ పునరుత్పత్తి హక్కుల్ని కాపాడే వ్యక్తి కమలా హారిస్ గెలవాలని కోరుకున్నారు. చాలా మంది మహిళలు కమలా హారిస్ తరపున స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహించారు. అయితే, కమలా హారిస్ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో వారంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. సోషల్ మీడియా ద్వారా 4బీ ఉద్యమాన్ని ప్రారంభించారు.
'మహిళలు మరవకండి మనకు శక్తి ఉంది. మన శరీరాలను పురుషులకు అప్పగించడం మన ఛాయిస్. దీన్ని ఇక మనం చేయాల్సిన అవసరం లేదు' అంటూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. 4B అంటే వివాహం, సెక్స్, బిడ్డల్ని కనడం, డేటింగ్ వంటి నాలుగు వద్దు అని. మరోవైపు, ఈ ఉద్యమం చేస్తున్న మహిళలపై ఇతర మహిళలు విమర్శలు చేస్తున్నారు. ఇది సోషల్ మీడియా ట్రెండ్ అని.. ఉద్యమం కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications