అమెరికాతో 45 రోజుల సీజ్ ఫైర్? ఇరాన్ కీలక షరతు-పాక్ మధ్యవర్తిత్వం..!

ఇరాన్ (iran)పై దాడులు ప్రారంభించి రెండో నెలలోకి ప్రవేశించిన నేపథ్యంలో అమెరికా ప్రతిపాదిస్తున్న మధ్యవర్తిత్వ ప్లాన్ మరోసారి తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మరోసారి కాల్పుల విరమణపై సీరియస్ గా చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో అమెరికా సీజ్ పైర్ ప్రతిపాదనలపై చర్చించిన ఇరాన్.. కీలక షరతు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇరాన్ పై గత నెలలో సీరియస్ గా దాడులు చేస్తున్న క్రమంలో ట్రంప్.. హఠాత్తుగా సీజ్ ఫైర్ ప్రతిపాదనను తెరపైకి చేశారు. దీనికి 15 షరతులు కూడా పెట్టారు. అయితే ఇరాన్ దాన్ని తోసిపుచ్చింది. అయినా గడువుల్ని పొడిగించుకుంటూ వస్తున్న ట్రంప్.. తాజాగా మరో 48 గంటల డెడ్ లైన్ ఇచ్చారు. అయినా ఇరాన్ లొంగే పరిస్ధితి లేకపోవడంతో తెరవెనుక చర్చల ప్రతిపాదనల్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

No Temporary Truce Iran Refuses to Open Strait of Hormuz Despite Ceasefire Review

సీజ్ ఫైర్ పై చర్చించడానికి పాకిస్తాన్ ఆర్మీ ఛీప్ అసిమ్ మునీర్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీలతో రాత్రంతా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం తక్షణ కాల్పుల విరమణ, ఆ తర్వాత విస్తృతమైన, సమగ్రమైన ఒప్పందంతో కూడిన రెండు దశల ప్రక్రియ ఉంటుందని చెప్తున్నారు. అయితే తాత్కాలిక కాల్పుల విరమణలో భాగంగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అలాగే నిర్ణయం తీసుకోవడానికి ఇరాన్ ఒత్తిళ్లను గానీ, గడువులను గానీ అంగీకరించదని తేల్చిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+