కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్.. ఐదుగురు దుర్మరణం

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం నాడు పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోయింది. గిల్గిత్-బాల్టిస్తాన్‌లోని చిలాస్ పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. MI-17 హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోవడంతో పెద్ద శబ్దం వచ్చి, ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది.

గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రావిన్స్‌లోని చిలాస్ పట్టణంలో జరిగిన ఈ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ముగ్గురు టెక్నీషియన్లు ఉన్నారని తెలిసింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు టెక్నీషియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు డైమర్ జిల్లా సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్ హమీద్ ధ్రువీకరించారు. కొత్తగా నిర్మించిన హెలిప్యాడ్‌పై ట్రయల్ ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ కూలిపోయి మంటలు చెలరేగినట్లు ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరాఖ్ వెల్లడించారు. ఈ హెలికాప్టర్ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. దీని కోసం పోలీసులు, ప్రత్యేక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Pak Army Helicopter Crash in Gilgit-Baltistan 5 Personnel Dead

ప్రపంచవ్యాప్తంగా విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌లో ఇటీవల కూడా ఓ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. గత నెలలో వరద ప్రభావిత బాజౌర్ ప్రాంతానికి సహాయ సామగ్రిని తీసుకెళ్తునన ఒక హెలికాప్టర్ వాతావరణ కారణాల దృష్ట్యా కూలిపోయింది. ఆ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అలాగే సెప్టెంబర్ 2024లో ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా మరో హెలికాప్టర్ కూలి.. ఆరుగురు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+