భారత్ ను సీజ్ ఫైర్ ఎందుకు అడిగామంటే ? ట్రంప్ తో పాటు సౌదీ..! పాక్ ఉప ప్రధాని షాకింగ్..!

కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. తొలుత పాకిస్తాన్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలతో మొదలైన ఈ ఆపరేషన్ ను అనంతరం భారత్ వారి ఎయిర్ బేస్ లకూ విస్తరించింది. ఆ తర్వాత ఆయుధ రక్షణ వ్యవస్థలన్నీ దెబ్బతీసింది. ఈ నేపధ్యంలో నాలుగు రోజుల తర్వాత హఠాత్తుగా ట్రంప్ ఎంట్రీ ఇచ్చి భారత్-పాక్ లను కాల్పుల విరమణకు ఒప్పించినట్లు ట్వీట్ చేయడం, అనంతరం ఇరు దేశాలూ దీనిపై ప్రకటన చేయడం జరిగిపోయింది.

అయితే ఇంత హఠాత్తుగా పాకిస్తాన్ ఎందుకు కాల్పుల విరమణ కోరాల్సి వచ్చిందనే చర్చ అప్పటి నుంచీ జరుగుతూనే ఉంది. ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లే భారత్ తో పాటు పాకిస్తాన్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయన్న వాదనల మధ్య తాజాగా ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ కీలక వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ జోరుగా సాగుతున్న సమయంలో పాకిస్తాన్ ఇలా ఎందుకు అకస్మాత్తుగా భారత్ తో కాల్పుల విరమణకు ప్రతిపాదించిందనే విషయాన్ని ఆయన ఓ టీవీ ఇంటర్వూలో పంచుకున్నారు.

Pakistan deputy pm ishaq dar reveals reason behind asking for ceasefire with india

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా రావల్పిండి, పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత తాము కాల్పుల విరమణకు అభ్యర్థించాల్సి వచ్చిందని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ వెల్లడించారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం, పంజాబ్ ప్రావిన్స్‌లోని పిఎఎఫ్ బేస్ రఫికి అని పిలిచే షోర్కోట్ వైమానిక స్థావరంపై భారత్ దాడి చేసిందని ఆయన తెలిపారు. ఈ సమయంలోనే పాకిస్తాన్ జోక్యం కోసం అమెరికాను సంప్రదించిందని, అలాగే సౌదీ అరేబియా నుండి కూడా సహాయం తీసుకుందని ఆయన తెలిపారు.

దురదృష్టవశాత్తు భారత్ మరోసారి తెల్లవారుజామున 2.30 గంటలకు క్షిపణి దాడులు ప్రారంభించిందని, వారు నూర్ ఖాన్ వైమానిక స్థావరం, షోర్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేశారని ఇషాక్ దార్ తెలిపారు. 45 నిమిషాల్లో సౌదీ యువరాజు ఫైసల్ తనకు ఫోన్ చేశాడని, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో తన సంభాషణ గురించి ఇప్పుడే తెలుసుకున్నానని చెప్పాడన్నారు. అలాగే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడి వారు ఆగిపోతే తామూ సిద్ధంగా ఉన్నామని వెల్లడించేందుకు తనకు అధికారం ఉందా అని ఆయన అడిగారన్నారు. తాను అవును సోదరా మీరు చేయగలరని చెప్పానన్నారు. ఆ తర్వాత ఆయన తనకు తిరిగి ఫోన్ చేసి జైశంకర్‌కు కూడా అదే విషయాన్ని చెప్పానన్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+