పాకిస్థాన్‌లో భారీ వర్షాలు, వరదలు: కొట్టుకుపోయిన కార్లు, అంధకారంలో కరాచీ

ఇస్లామబాద్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింధ్ ప్రావిన్స్ రాజదాని కరాచీలో శనివారం రాత్రి వర్షం దంచికొట్టడంతో నగరం మొత్తం తడిసిముద్దయింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరదలో కార్లు, తదితర వాహనాలు కొట్టుకుపోయాయి. లోట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

700 వందలకుపైగా విద్యుత్ ఫీడర్లు కూలిపోవడంతో అనేక ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. భారీ వర్షానికి వరదనీరు ఇళ్లు, ఆస్పత్రుల్లోకి చేరడంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై వరదనీరు ప్రవహించడంతో బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్ష సూచన ఉన్నప్పటికీ స్థానిక ప్రభుత్వం ఎలాంటి చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Pakistan: Heavy rainfall submerges Karachis major roads, power cuts, rescue operations underway

అయితే, కుండపోత వర్షం కురిసిన తర్వాత కరాచీ నగర వాసులకు స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. కరాచీ రెస్క్యూ 1122 ప్రజలను ఇంటి లోపలే ఉండమని కోరుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. 'ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని అభ్యర్థించారు. రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌ల కారణంగా రెస్క్యూ బృందాలు అత్యవసర ప్రతిస్పందనలలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి' అని స్థానిక మీడియా పేర్కొంది.

పాకిస్థాన్ వాతావరణ విభాగం (పీఎండీ) నగరం అంతటా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా, నగరంలోని పలు ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్‌లు ప్రజలకు సహాయంగా పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క భవనం కూడా కూలిన సంఘటనలు జరగలేదు. అయితే గోడ కూలడంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.


కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ మాట్లాడుతూ.. అనవసరమైన ప్రయాణాలను పరిమితం చేయాలని నివాసితులను కోరారు. ప్రధాన రహదారులను క్లియర్ చేయడానికి బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయని తెలిపారు. కాగా, వరదలకు తక్షణ కారణాలు సాధారణ రుతుపవనాల కంటే భారీ వర్షాలు , కరిగిపోతున్న హిమానీనదాలు,ఈ రెండూ వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+