ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో..

పాకిస్థాన్ అంటేనే ఎప్పుడూ అంతర్గత కలహాలు, సంక్షోభం, ఉగ్రవాదం, పేదరికం, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కొరత.. తదితర కారణాలతో నిండి ఉంటుంది. దశాబ్దాలుగా ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా పాకిస్థాన్ మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో పాకిస్థాన్ తొలి స్థానంలో నిలిచింది. ఇక గతేడాది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో తొలిసారిగా పాకిస్థాన్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలు 6 శాతం పెరిగిన నేపథ్యంలో ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్- 2026 లో పాకిస్థాన్ తొలి స్థానానికి ఎగబాకింది. ఈ నివేదికను ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్(IEP) ప్రచురించింది. ఇక గతేడాది పాకిస్థాన్ లో 1,329 మరణాలు నమోదయ్యాయి. దాంతో ఆ దేశంలో భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 163 దేశాల్లోని పరిస్థితులను స్టడీ చేసింది. పాకిస్థాన్.. తన సరిహద్దు దేశాలతో కొనసాగిస్తున్న సంబంధాలనూ పరిగణలోకి తీసుకుంది. అఫ్గానిస్తాన్ తోపాటుగా అలాగే తెహ్రీక్- ఐ- తాలిబాన్ పాకిస్థాన్ అండ్ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి ప్రపంచ దేశాలకు భద్రతా పరమైన సమస్యలు ఎదురైనట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఈ పరిశోధనలో పాకిస్థాన్ లో ఉగ్రవాదం కారణంగా మృతి చెందుతున్నవారి సంఖ్య 2013 నుంచి గణనీయంగా పెరుగుతోంది. ఈ మేరకు 2025 లో 1,139 ఉగ్రవాద మరణాలు, 1,045 ఉగ్రవాద ఘటనలు జరిగాయి.

ఇక పాకిస్థాన్ లో తెహ్రీక్- ఐ- తాలిబాన్ పాకిస్థాన్(TTP) అత్యంత ప్రమాదకరమైన టెర్రర్ గ్రూప్ గా పేరుగాంచింది. అలాగే ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్రమాదకర గ్రూప్ గా నిలిచింది. 2009 నుంచి టీటీపీ ద్వారానే 67 శాతానికి పైగా దాడులు జరిగినట్లు వెల్లడైంది. గతేడాది నుంచి ఈ ఉగ్రవాద సంస్థ మరింత యాక్టివ్ గా పని చేస్తున్నట్లు తేలింది. ఈ దాడులు 25 శాతం పెరిగాయి. ఈ సంస్థ దాడులు ఎక్కువగా ఖైబర్ పంఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోనే జరిగాయి.

Pakistan Tops Global Terrorism Index 2025 Highest Terrorism Impact in World terrorism index news

ఇక గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో పాకిస్థాన్ తొలిస్థానంలో నిలవగా బుర్కినా ఫసో, నైజీరియా, నైగర్, మాలి, సిరియా, సోమాలియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కొలంబియా, ఇజ్రాయెల్ తర్వాతి స్థానంలో నిలిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+