వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లూటోపై జీవం ఉండే ఛాన్స్, మానవుడే సంక్లిష్ట జీవి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: ప్లూటో గ్రహం ఉపరితలం కిందిభాగంలో జీవుల మనుగడకు అనువైన వెచ్చని సముద్రం ఉండే అవకాశాలు ఉన్నాయని భౌతిక శాస్త్రవేత్త బ్రియాన్ కాక్స్ అభిప్రాయపడ్డారు.

ప్లూటో గ్రహం ఉపరితలం పైన కనిపిస్తున్న హిమనీనదాల ఊటలు ఇందుకు నిదర్శనం అని చెప్పారు. ప్లూటోకు సంబంధించి న్యూహోరిజాన్స్ అంతరిక్ష నౌక సేకరించిన వివరాలను పూర్తిగా విశ్లేషిస్తే మరింత స్పష్టత రావొచ్చునని ఆయన అన్నారు.

Pluto's crust might have aliens living under it, says Brian Cox

జీవానికి సంబంధించిన ఆధారాలు భూమికి దగ్గరగా ఉన్న గ్రహాల ఉపగ్రహాల పైనే దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పాలపుంతలోని జీవులలో అత్యంత సంక్లిష్ట జీవి మానవుడే అయి ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, ప్లూటో వ్యవస్థ పైన సమగ్ర అధ్యయనాన్ని పూర్తి చేసిన న్యూహోరిజాన్స్ అంతరిక్ష నౌక అక్కడి నుంచి సుమారు వంద కోట్ల మైళ్ల దూరంలోని 2014 ఎంయూ 69 అనే ప్లానెటాయిడుపై అధ్యయనం కొనసాగిస్తోంది.

English summary
Over the past six weeks, mankind has learnt more about Pluto than in the previous 85 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X