వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

G20 Summit : భారత్ ఎనర్జీ సెక్యూరిటీకి ప్రపంచానిదే బాధ్యత-జీ20 సదస్సులో మోడీ కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

ఇండోనేషియాలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సుకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల అధినేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ప్రధాని.. మన దేశంలో శక్తిరంగం భద్రతకు సంబంధించి కూడా ఓ సెషన్ లో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని జీ20 దేశాలకు ఓ విజ్ఞప్తి చేశారు.

భారత్ లో శక్తి రంగం భద్రతకు ప్రపంచ దేశాలు హామీ ఇవ్వాల్సి ఉంటుందని జీ20 సదస్సులో ప్రధాని మోడీ కోరారు.
ప్రపంచ వృద్ధికి భారతదేశం యొక్క ఇంధన-భద్రత చాలా ముఖ్యమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.
భారత్ లో ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షల్ని ప్రోత్సహించవద్దని మోడీ కోరారు. ఇంధన మార్కెట్‌లో స్థిరత్వం రావాలని ఆయన సూచించారు. అదే సమయంలో స్వచ్ఛ ఇంధనం, పర్యావరణం పట్ల భారత దేశ నిబద్ధతను మోడీ గుర్తుచేశారు. 2030 నాటికి భారతదేశ విద్యుత్తులో సగం పునరుత్పాదక వనరుల నుండి ఉత్పత్తి చేయబోతున్నట్లు మోడీ హామీ ఇచ్చారు.

pm modi explained G20 leaders on why world should ensure indias energy security

అంతర్జాతీయంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా భారత్ లో కర్బన ఉద్గారాల్ని కూడా తగ్గించుకోవాల్సిన పరిస్దితి ఉంది. దీంతో ఈ ప్రభావం సహజంగానే ఇంధన రంగంపై పడుతోంది. ముఖ్యంగా ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి వల్ల పెరుగుతున్న కర్బన ఉద్గారాలతో భారత్ కు ఆంక్షలు తప్పడంలేదు. ఈ విషయంలో తమకు సహకరించాలని ప్రధాని మోడీ ఇవాళ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. తద్వారా భారత్ ప్రపంచ ఆర్ధిక చిత్రపటంలో పుంజుకునేందుకు వీలు కలుగుతుందన్నారు.

English summary
pm modi on today made key comments on india's energy security in his address at G20 summit in indonasia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X