మోడీకి మా బాధ తెలుసు, భారత్ మా వెంటే: పాక్‌కు బెలూచిస్తాన్ నేత షాక్

బెలూచిస్తాన్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి తమ బాధ, ఆవేదన అంతా బాగా తెలుసునని బెలూచిస్తాన్ నేత మజ్దక్ దిల్షాద్ శనివారం నాడు అన్నారు. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ బెలూచిస్తాన్‌ను ప్రస్తావించిన విషయం తెలిసిందే.

దీంతో బెలూచిస్తాన్ నేతలు, ప్రజల్లో మరింత బలం పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్‌ను కూడా వారు సమర్థించారు. తాజాగా అతను మరోసారి మాట్లాడుతూ.. తమ వెంట భారత్ ఉందని చెప్పారు. మోడీకి తమ బాధ తెలుసునని చెప్పారు.

గత డెబ్బై ఏళ్లలో ఏ బెలూచిస్తాన్ నేత కూడా భారత్ రాలేదని, కానీ ఇప్పుడు తాము వస్తున్నామని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇన్నేళ్లలో తొలిసారి భారత్ సహకారం కోరుతున్నామన్నారు. ఐక్య రాజ్య సమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగానికి తాము ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ఆటోవాలా కూడా మోడీ స్పీచ్ గురించి అడుగుతున్నారన్నారు.

PM Narendra Modi understands pain of our people: Baloch leader

ఐరాసలో పాక్‌కు మొండిచేయి

కాశ్మీర్‌ సమస్య, ఎల్వోసీ వెంబటి భారత సైన్యం కాల్పులు జరపడంపై జోక్యం చేసుకోవాలంటూ ఐరాసలో పాకిస్తాన్ శాశ్వత రాయబారి మలీహా లోధీ ప్రధాన కార్యదర్శిని, భద్రతామండలిని కోరారు. దీనిపై పాక్‌కు ఒక్క సభ్య దేశం నుంచి కూడా మద్దతు లభించలేదని ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తెలిపారు.

మరో షాక్: పాక్‍‌ను దెబ్బతీసేందుకు మోడీ మరో వ్యూహం!పాక్‌ రాయబారి శుక్రవారం ఐరాస ప్రధాన కార్యదర్శిని కలిశారని, న్యూజిలాండ్‌ రాయబారితో కలిసి వెళ్లి భద్రతామండలిలో చర్చించారని, భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్, కాశ్మీర్‌ అంశంపై పాక్‌కు మద్దతు లభించిన దాఖలాల్లేవని, దీనిపై మాట్లాడటానికి ఏ ఒక్క దేశం ఆసక్తి చూపలేదని అక్బరుద్దీన్‌ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+