వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేటా చోరీ, వివాదాల ఎఫెక్ట్: ఫేస్‌బుక్ ఛైర్మన్‌గా మార్క్ జుకర్‌బర్గ్ తొలగింపు?

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫేస్‌బుక్ వివాదాల ఎఫెక్ట్

వాషింగ్టన్‌: గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఫేస్‌బుక్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌లో చోటు చేసుకున్న డేటా హ్యాక్‌, ఫేక్‌ న్యూస్‌ ఇష్యూ ఆ కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ పదవికి ముప్పుగా మారింది.

మార్క్ జుకర్‌బర్గ్ తొలగింపు?

మార్క్ జుకర్‌బర్గ్ తొలగింపు?

ఈ సోషల్‌ మీడియా దిగ్గజ చైర్మన్‌గా మార్క్‌ జుకర్‌బర్గ్‌ను తొలగించాలని ప్రతిపాదన తెరపైకి రావడం గమనార్హం. ఫేస్‌బుక్‌ ఇంక్‌లో మెజార్టీ షేర్లను కలిగి ఉన్న నాలుగు దిగ్గజ అమెరికా పబ్లిక్‌ ఫండ్స్‌ బుధవారం మార్క్‌ జుకర్‌బర్గ్‌ను చైర్మన్‌గా తొలగించాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాయి.

 2017 తర్వాత ఇప్పుడే..

2017 తర్వాత ఇప్పుడే..

కంపెనీలో అతిపెద్ద అసెట్‌ మేనేజర్లు కూడా ఈ ప్రతిపాదనకే ఓకే చేస్తారని అవి ఆశిస్తున్నారు. ఈ ప్రతిపాదన దాఖలు చేసిన వాటిలో ఇల్లినోయిస్‌‌, రోడ్ ఐలండ్, పెన్సిల్వేనియాలకు చెందిన స్టేట్‌ ట్రెజర్స్, న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ స్కాట్ స్ట్రింగర్ ఉన్నాయి. ఇలాంటి ప్రతిపాదనే ఫేస్‌బుక్‌లో 2017లో ఒకసారి వచ్చింది. తాజాగా మరోసారి తెరపైకి రావడం గమనార్హం.

మరో మార్గం లేదా?

మరో మార్గం లేదా?

తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన ఎంతో కీలకమైనదని రోడ్‌ ఐలండ్‌ స్టేట్‌ ట్రెజర్స్‌ వెల్లడించింది. డేటా హ్యాక్‌, కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌ వంటి సమస్యల నుంచి ఫేస్‌బుక్‌ను బయటపడేయడానికి ఇదే మార్గమని అభిప్రాయపడింది. వార్షిక సమావేశంలో ఎలాగైనా ఈ ప్రతిపాదనన చర్చించేలా చేస్తామని రోడ్‌ ఐలండ్‌ స్టేట్‌ ట్రెజర్‌ సేథ్‌ మాగజైనర్‌ చెప్పారు.

జుకర్‌బర్గ్ సానుకూలంగా స్పందిస్తేనే..

జుకర్‌బర్గ్ సానుకూలంగా స్పందిస్తేనే..

అయితే, ఈ విషయంపై స్పందించడానికి ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. కంపెనీ వార్షిక సమావేశం 2019 మేలో జరగనుంది. స్వతంత్ర బోర్డ్‌ చైర్‌ను నియమించాలని బోర్డును కోరతామని తెలిపారు. జుకర్‌బర్గ్ తొలిగింపు వార్తల నేపథ్యంలో బుధవారం ఫేస్‌బుక్‌ షేర్లు 10 శాతం కిందకి పడిపోయాయి. కాగా, పెన్సిల్వేనియా ట్రెజరీ 38,737 షేర్లను, ఇల్లినోయిస్ ట్రెజరీ 1,90,712 షేర్లు, రోడ్‌ ఐలండ్‌ ట్రెజరీ 1,68,230 షేర్లను కలిగి ఉంది. అయితే జుకర్‌బర్గ్‌ 60శాతం ఓటింగ్‌ హక్కులు ఉండటంతో, ఆయన సానుకూలత లేకుండా తొలగింపు సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.

English summary
Following a long string of scandals and controversies, some Facebook investors believe the company would be better off without Mark Zuckerberg as its chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X