ఉ.కొరియాతో డేంజర్‌లో చైనా: మరోసారి ఆ ప్రయోగం జరిగితే నాశనమే!, డ్రాగన్ వాదన మరోలా..

Subscribe to Oneindia Telugu
  North Korea Drag China into Trouble కొరియాతో డేంజర్‌లో చైనా: ఆ ప్రయోగం జరిగితే నాశనమే!|Oneindia

  ప్యోంగ్‌యాంగ్/బీజింగ్: ఆర్థిక, వాణిజ్య అవసరాల కోసం మిత్ర దేశం ఉత్తరకొరియాను వెనకేసుకొచ్చిన చైనా అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. ఏకంగా మిత్రదేశంతోనే ప్రమాదాన్ని కొనితెచ్చుకుని తలబాదుకుంటోంది.

  ఉత్తరకొరియా ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు ఎఫెక్ట్ చైనా సరిహద్దు ప్రాంతాలను కూడా తాకే ప్రమాదం ఉండటంతో ఆ దేశంలో ఆందోళన మొదలైంది. ఉత్తరకొరియా పుంగె-రి కొండల్లోని సొరంగంలో నిర్వహించిన హైడ్రోజన్‌ బాంబు ప్రయోగం ఫలితంగా ఆ సొరంగం కూలిపోయి, కొండ బీటలువారింది. అయితే ఆ పేలుడు నుంచి వెలువడిన రేడియో ధార్మిక ఉద్ఘారాలు చైనాలోకి వచ్చే ప్రమాదం ఏర్పడింది.

  మరో ప్రయోగం చేపడితే అంతే:

  మరో ప్రయోగం చేపడితే అంతే:

  ఇదే ప్రాంతంలో ఉత్తరకొరియా గనుక మరో అణుపరీక్షకు సిద్దపడితే చైనా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రేడియో ధార్మిక ఉద్ఘారాలు చైనాలోకి వ్యాపిస్తే.. దాని ప్రభావంతో వేలమంది ప్రజలు చనిపోయే ప్రమాదముంది. అమెరికాకు చెందిన రాన్డ్ కార్పొరేషన్ అనే రక్షణ వ్యవహారాల విశ్లేషణా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

  చైనా వాదన మరోలా?:

  చైనా వాదన మరోలా?:

  ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా-చైనా సంబంధాలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికైనా ఐరాస చెప్పినట్లు ఉత్తరకొరియాతో వాణిజ్య సంబంధాలను వదులుకుని చైనా ఆ దేశానికి బుద్ది చెబుతుందా? లేక ఆర్థికంగా సహకరిస్తూ తన ఉనికికే ముప్పు తెచ్చుకుంటుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చైనా మాత్రం హైడ్రోజన్ బాంబు ఎఫెక్ట్ తమ దేశంపై లేదని చెప్పుకురావడం గమనార్హం. సరిహద్దు వెంబడి ఆ ప్రభావమేమి కనిపించలేదని చైనా వాతావరణ రక్షణ శాఖ స్పష్టం చేసింది.

  చైనా సహకారం లేకనే:

  చైనా సహకారం లేకనే:

  ప్రపంచ దేశాల మాటను లెక్క చేయని ఉత్తరకొరియా.. తన ఆర్థిక మూలాల రీత్యా ఒక్క చైనాతో మాత్రమే సంయమనం పాటిస్తోంది. చైనా ఆదేశానుసారం నడుచుకోవడానికి ఉత్తరకొరియా ఎప్పుడూ ఒకింత సుముఖంగానే ఉంటుంది. కాబట్టి చైనాను ముందుకు పెట్టి ఉత్తరకొరియాతో శాంతి చర్చలు జరపాలని ఐరాస భావించినప్పటికీ.. దౌత్యపరంగా చైనా ఆ దేశానికే వంతపాడింది. దీంతో చర్చలకు బీజం పడలేదు సరికదా.. ఉత్తరకొరియా-అమెరికా మధ్య యుద్ద ముసురు కమ్ముతున్నట్లే అనిపిస్తోంది.

  ఐరాస ఆంక్షలు:

  ఐరాస ఆంక్షలు:

  ఉత్తరకొరియా ఏమాత్రం వెనక్కి తగ్గకపోతుండటంతో ఐరాస సైతం తీవ్ర చర్యలకు సిద్దమైంది. ప్రపంచ దేశాలతో ఉత్తరకొరియా దౌత్య సంబంధాలను దెబ్బతీయాలని భావిస్తోంది. ఇందుకోసం అమెరికా సిద్దం చేసిన ఆంక్షల ముసాయిదాను ఐరాస భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.

  ఇందులో భాగంగా ఉత్తరకొరియా ఆయిల్ దిగుమతులు, టెక్స్ టైల్ ఎగమతులపై నిషేధం, ఉత్తరకొరియా కార్మికులపై విదేశీ నిషేధం, అక్రమ రవాణా అణచివేత, సంయుక్త ప్రాజెక్టుల నిలిపివేత వంటి కీలక అంశాలున్నాయి. ఈ ఆంక్షల ద్వారానైనా ఉత్తరకొరియా దారికొస్తుందా? అంటే కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  China has concluded that radiation levels remain normal in the provinces near the North Korean border after Pyongyang’s most powerful nuclear test yet spurred concerns of residual environmental damage.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి