వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్వాన్ లోయలో షాకింగ్- భారత జెండా స్ధానంలో చైనా జెండా ? మోడీ వివరణ కోరిన రాహుల్

|
Google Oneindia TeluguNews

తూర్పు లడఖ్ పరిధిలోకి వచ్చే గల్వాన్ లోయలో చైనా దుస్సాహసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అక్కడ ఎప్పుడూ ఎగురుతూ ఉండే భారత జాతీయ పతాకం స్ధానంలో చైనా జాతీయ పతాకాన్ని ఎగరేసినట్లు సమాచారం. కొత్త ఏడాది సందర్భంగా గల్వాన్ లోయలో చైనా బలగాలు తమ జాతీయ పతాకాన్ని ఎగరేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. ఇందులో చైనా బలగాలు తమ జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్న దృశ్యాలున్నాయి. దీంతో ఈ వీడియోపై విపక్షాలు మండిపడుతున్నాయి.

చైనా మీడియా రిపోర్టర్ ఒకరు తన ట్విట్టర్ పేజ్ లో కొత్త ఏడాది వేడుకల సందర్భఁగా గల్వాన్ లోయలో తమ సైనికులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వీడియో పెట్టారు. ఇది బీజింగ్ లోని తియాన్మన్ స్క్వేర్ లో ఉన్నంత గొప్పగా ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై భారత్ లో విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇదే కోవలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. గల్వాన్ లోయలో చైనా జాతీయ పతాకావిష్కరణ వార్తలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు లడఖ్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబాట్లను అడ్డుకోవడంలో ఎన్డీయే సర్కార్ విఫలమైందంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు. గల్వాన్ లో మన త్రివర్ణ పతాకం ఎంతో గొప్పగా కనిపించేది. ఇప్పుడు చైనా పతాకం కనిపిస్తోంది. దీనిపై చైనాతో పాటు ప్రధాని మోడీ మౌనాన్ని వీడాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

rahul gandhi seek response from modi sarkar on chinas unfurling of national flag in galwan valley

తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో 15 స్ధలాలకు చైనా పేర్లు మార్చడంపై రాహుల్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు. అయితే పేర్లు మార్చినంత మాత్రాన భారత్ కు అరుణాచల్ ప్రదేశ్ పై ఉన్న హక్కుల్ని మార్చలేరంటూ విదేశాంగశాఖ స్పందించింది. ఇప్పుడు ఏకంగా గల్వాన్ లోయలో భారత మువ్వన్నెల పతాకం స్ధానంలో చైనా జెండా ఎగరేసిన ఘటనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary
congress mp rahul gandhi on today targets centre and pm modi over reportedly china has unfurled thier national flag in galwan valley in the place of indian flag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X