పిస్టోరియస్‌ను వదిలేయాలనుకున్న రీవా, శృంగారంలో..

లండన్/జోహన్నస్‌బర్గ్: తన ప్రియురాలైన మోడల్ రీవా స్టీవ్ కాంప్‌ను చంపిన దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌కు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో.. తన కూతురు పిస్టోరియస్‌తో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుందని, అతడిని వదిలి వచ్చేద్దామన్న సమయంలో హత్యకు గురైందని రీవా స్టీవ్ క్యాంప్ తల్లి జూన్ స్టీవ్ కాంప్ తెలిపింది.

రీవా మరణం పైన 'రీవా.. ఏ మదర్స్ స్టోరీ' అన్ని పుస్తకాన్ని ఆమె రాసింది. హంతకుడిగా కాకుండా... హత్యానేరం కింద పిస్టోరియస్ దోషిగా తేలడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. రీవా తన దుస్తులను బ్యాగ్‌లో సర్దుకుందని, పిసోట్రియస్‌కు దూరమవ్వాలని ఆ రోజు రాత్రి నిర్ణయించుకుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది.

కానీ రీవా దురదృష్టవంతురాలని, పిస్టోరియస్‌ను నమ్మిందని, తమ అమా్మాయి లేదంటే మరొకరినైనా పిస్టోరియస్ చంపేసేవాడని, అతడు పొగరుబోతు, చంచల స్వభావి అని దుయ్యబట్టింది. తుపాకులంటే ఇష్టపడేవాడని, రీవాను సొంతం చేసుకోవాలనుకున్నాడని పేర్కొంది.

Reeva Steenkamp's mother says, Reeva planned to leave Pistorius

హత్య జరిగిన రోజు ఏదో జరిగిందని, భయపడిపోయిన రీవా రెండు ఫోన్లు తీసుకొని స్నానాల గదిలోకి వచ్చిందని, ఆమె అందరికీ ఎక్కడ చెప్పేస్తుందోనని పిస్టోరియస్ నాలుగుసార్లు తుపాకీతో కాల్చాడని పుస్తకంలో పేర్కొంది. పిస్టోరియస్‌తో రీవా స్టీవ్ కాంప్ శృంగారంలో పాల్గొనలేదని తల్లి పేర్కొంది. తమ బంధాన్ని ఆ స్థాయికి తీసుకు వెళ్లే ధైర్యం రీవాకు లేదని పేర్కొంది.

కాగా, ప్రేయసి రీవా స్టీన్ కాంప్‌ను హత్య చేసిన కేసులో దోషిగా ఉన్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌పై మరో మాజీ ప్రేయసి తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పిస్టోరియస్ మాజీ ప్రేయసి సమంత టేలర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రీవా స్టీన్ కాంప్‌ను పొరపాటున కాల్చి చంపానని పిస్టోరియస్ అంటున్నప్పటికీ.. అతడు చాలా ప్రమాదకర వ్యక్తి' అని తెలిపింది.

అంతేగాక ‘రీవా కంటే ముందు నేను బలవాల్సింది. రీవా చనిపోయినప్పుడు చాలా మంది నేనే చనిపోయానని అనుకున్నారు. నా మృతికి సంతాపం తెలియజేస్తూ సందేశాలు కూడా పంపారు' అని సమంతా టేలర్ పేర్కొంది. పిస్టోరియస్‌తో ఉన్నంత కాలం తాను భయపడుతూనే ఉన్నానని చెప్పింది.

అతను తనను అనుమానించేవాడని, తన జీవితంలో మరెవరైనా ఉండేవారేమో అని తరచుగా తన మొబైల్ ఫోన్ చూస్తుండేవాడని తెలిపింది. పిస్టోరియస్‌కు తుపాకీలంటే పిచ్చిన సమంతా టేలర్ చెప్పింది. అతడి దగ్గర ఎప్పుడూ తుపాకీలుండేవని తెలిపింది. రీవా హత్య కేసులో సమంతా టేలర్ కూడా కోర్టు విచారణలో సాక్ష్యం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+