ఉక్రెయిన్ పై అణుదాడి-ఎప్పుడో చెప్పేసిన రష్యా-అదే టర్నింగ్ పాయింట్

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ప్రపంచ దేశాల హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. అయితే యుద్ధం మొదలై నెల రోజులు దాటిపోయినా ఫలితం తేలకపోవడం, యుద్ధంలో తగులుతున్న ఎదురుదెబ్బలతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా అణుదాడికి దిగొచ్చనే వాదన వినిపిస్తోంది. దీనిపై రష్యా ఇవాళ క్లారిటీ ఇచ్చేసింది.

ఉక్రెయిన్ పై రష్యా అణుదాడి

ఉక్రెయిన్ పై రష్యా అణుదాడి

ఉక్రెయిన్ పై చేపట్టిన దండయాత్ర నెలరోజులు దాటిపోయినా ఫలితం తేలకపోవడంతో అసహనంగా ఉన్న రష్యా ఈ యుద్ధాన్ని ముగించేందుకు అణుదాడిని ఆశ్రయించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రష్యా అమ్ములపొదిలో పోగుపడిన అణ్వస్త్రాలను తొలిసారి వాడేందుకు ఇంతకంటే మంచి అవకాశం లేదన్న భావనలో పుతిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రష్యా ఉక్రెయిన్ పై చేయబోయే అణుదాడిపై ప్రపంచదేశాల్లో ఆందోళన పెరుగుతోంది.

రష్యా నోట అణుదాడి మాట

రష్యా నోట అణుదాడి మాట

ఉక్రెయిన్ తో పోరులో ఎదురుదెబ్బల నేపథ్యంలో రష్యా అణుదాడికి పాల్పడవచ్చని ఇప్పటివరకూ ప్రపంచదేశాలు మాత్రమే అనుమానిస్తుండగా.. ఇప్పుడు రష్యా సైతం దీనిపై నోరు విప్పింది. అణుదాడిపై ఉక్రెయిన్ తో పాటు పశ్చిమ దేశాలకు కూడా క్లారిటీ ఇచ్చింది. అణుదాడి చేయాలని భావిస్తే ఎప్పుడు చేస్తామో కూడా రష్యా చెప్పేసింది. దీంతో రష్యా క్రెమ్లిన్ ప్రతినిధి చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఉక్రెయిన్ పై అణుదాడి అప్పుడే

ఉక్రెయిన్ పై అణుదాడి అప్పుడే

ఉక్రెయిన్ పై రష్యా అణుదాడి చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పీబీఎస్ న్యూస్ అవర్ లో నోరు విప్పారు. తమ ఉనికికి ముప్పు ఏర్పడితేనే రష్యా అణుదాడికి దిగుతుందని ఆయన తేల్చిచెప్పారు. తమ అస్తిత్వానికి ముప్పు ఉన్నప్పుడే, దాన్ని తొలగించడానికి అణ్వాయుధాలను వాడతామని పెస్కోవ్ తెలిపారు.

ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పే హక్కు కూడా తమకు ఉందన్నారు. అలాగే ఉక్రెయిన్ పై రష్యా ఆపరేషన్ లో వెలువడే ఫలితం మాత్రం తాము అణ్వాయుధాల్ని వాడేందుకు కారణం కాబోదన్నారు. దీంతో ఉక్రెయిన్ ఊపిరిపీల్చుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+