Russia vs Ukraine:అమెరికా యుద్ధ సామగ్రితో ఉక్రెయిన్ సైనికుల శిక్షణ..రష్యాను ఢీ కొట్టగలరా..?
రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ ముదురుతోంది. గత కొన్ని వారాలుగా సరిహద్దుల వద్ద కాల్పుల కలకలం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు అండగా ఉండాలని అగ్రరాజ్యం అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌కు కావాల్సిన మిత్రసాయం అందిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ బలగాలు యావోరివ్ మిలటరీ బేస్ వద్ద శిక్షణ పొందుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. శుక్రవారం రోజున ఉక్రెయిన్ బలగాలు యాంటీ ట్యాంక్ క్షిపణులు ఎలా వినియోగించాలో శిక్షణ పొందారు. అదే సమయంలో లాంచర్లు, ఇతర మిలటరీ హార్డ్‌వేర్ వ్యవస్థపై కూడా పట్టు సాధించారు. ఇదంతా శిక్షణలో భాగంగా చేశారు. 200 మిలియన్ డాలర్లు విలువ చేసే ఈ వ్యవస్థను ఉక్రెయిన్‌కు ఇచ్చింది అమెరికా.
మిలటరీ దుస్తుల్లో ఉన్న ఉక్రెయిన్ సైనికులు క్షిపణులు ఎలా పేల్చాలో శిక్షణ పొందుతుండగా మరికొందరు సైనికులు ఆ పక్కనే నిలబడి జాగ్రత్తగా పరిశీలించారు. ఇక మంచు దుప్పటి కప్పిన ప్రాంతాల్లో మిలటరీ వాహనాలు రుయ్యిమని దూసుకెళ్లాయి. గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా ఆపన్న హస్తం అందిస్తోంది. ఇందులో భాగంగానే మిలటరీ సామగ్రిని ఉక్రెయిన్‌కు చేరవేసింది. గత కొన్ని రోజుల్లో ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు 10వేల మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా చంపేసినట్లు తెలుస్తోంది. అయితే రష్యా మాత్రం తాము ఈ పనికి పాల్పడలేదని వివరణ ఇచ్చింది.

Recommended Video
అమెరికా నుంచి వచ్చిన మిలటరీ సామగ్రి తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ప్రతినిధి ఆండ్రి బెస్త్యుక్ చెప్పారు. ఈ మిలటరీ సామగ్రితో రష్యా నుంచి తమ భూభాగంలోకి వచ్చే మిలటరీ వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా శతృవులు దాక్కున్న ప్రాంతాలపై కూడా దాడి చేస్తామని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో ప్రశాంతత శాంతి నెలకొనాలంటే యుద్ధానికి సిద్ధం కావాలంటూ మరో సైనికుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక త్వరలోనే మరో దఫా ఆయుధాలు విమానం ద్వారా అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు చేరుకుంటాయని ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి ఓలెక్సీ రెజ్‌నికోవ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications