ఆప్ఘన్ ను వీడిన అమెరికాపై పుతిన్ సెటైర్లు-అంతా ట్రాజెడీ-ఇద్దరూ బాధితులే
ఇదే క్రమంలో ఆప్ఘన్ లో పరిస్దితిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కూడా స్పందించారు. ఆప్ఘన్ లో గత రెండు దశాబ్దాల్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోందన్న దానిపై పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆప్ఘనిస్తాన్ ను రెండు దశాబ్లాల పాటు కాపలా కాసిన అమెరికా బలగాల వల్ల ఆ దే్శంతో పాటు ఆప్ఘనిస్తాన్ కు సైతం విషాదం, ప్రాణనష్టమే మిగిలిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ గుర్తు చేశారు. అమెరికా బలగాలు ఆప్ఘన్ ప్రజల్లో మార్పు కోసం ప్రయత్నించాయని, కానీ ఫలితం మాత్రం విషాదాంతంగానే మిలిగిందన్నారు. అమెరికా బలగాలు ఆప్ఘన్ గడ్డను వీడిన ఒక్క రోజు తర్వాత పుతిన్ రష్యాలో దీనిపై మాట్లాడారు.

రష్యాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులతో మాట్లాడిన పుతిన్... ఆప్ఘన్ భూభాగంలో 20 సంవత్సరాల పాటు యుఎస్ బలగాలు ఉన్నాయి 20 సంవత్సరాలు అక్కడ నివసించే వ్యక్తులను నాగరికుల్ని చేయడానికి, వారి స్వంత నిబంధనలు, జీవన ప్రమాణాలను సాధ్యమైనంత వరకు విస్తరించడానికి ప్రయత్నించాయి. కానీ చివరికి ఏమీ చేయలేకపోయాయని పుతిన్ ఆక్షేపించారు. తాజా పరిస్ధితుల నేపథ్యంలో పుతిన్ స్పందన అమెరికాతో పాటు ఆప్ఘన్ లోని పరిస్ధితిని స్పష్టం చేసింది.
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలనపై రష్యా ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటివరకూ ఆప్ఘన్ ను ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలించిన అమెరికా, అష్రఫ్ ఘనీ ప్రభుత్వాలను పుతిన్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. తాలిబన్ల పాలన విషయంలో భారత్ ను కూడా చర్చలకు ఒప్పించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆప్ఘన్ లో పరిస్ధితుల దృష్చ్యా వారితో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని గతంలో పుతిన్ చెప్పారు. ఇప్పుడు అమెరికాతో పాటు గత ప్రభుత్వాల పాలనపై పుతిన్ చేసిన విమర్శలతో తాలిబన్లకు ఆయన మరోసారి మద్దతిచ్చినట్లయింది. పుతిన్ తాజా వ్యాఖ్యలపై అమెరికాతో పాటు తాలిబన్లు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications