సౌదీలో సల్మాన్ పగ్గాలు: 11 యువరాజులు, మంత్రుల అరెస్ట్
పదకొండు మంది యువరాజులుతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఓ బిలియనీర్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వ అరెస్టు చేసింది.
రియాద్: పదకొండు మంది యువరాజులుతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఓ బిలియనీర్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వం అరెస్టు చేసింది. రాజుగా మహ్మద్ బిన్ సల్మాన్ పగ్గాలు చేపట్టిన అనంతరం శనివారం కొత్త అవినీతి నిరోధక కమిషన్‌ను సౌదీ ప్రారంభించింది. కమిషన్ కొలువుదీరిన కొద్ది గంటల్లోనే ఈ అరెస్టులు జరిగాయి.
ఈ అరెస్టులకు ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ నేషనల్ గార్డ్ హెడ్, నేవీ చీఫ్, ఆర్థిక శాఖ మంత్రులను సల్మాన్ పదవుల నుంచి తొలగించారు. కొత్త కమిషన్ పాత కేసులను తిరగదోడిన నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగాయని సౌదీ ప్రభుత్వ మీడియా సంస్ధ 'అల్ అరేబియా' పేర్కొంది. అత్యుత్తమ స్ధానాల్లో ఉండి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వ్యక్తులను ప్రభుత్వం వదిలిపెట్టబోదని ఈ సందర్భంగా తెలిపింది.

అవినీతికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని సౌదీ సర్కార్ ఈ ఘటనతో మరోసారి రుజువు చేసింది. ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేస్తూ ప్రజల సొమ్మును దోచుకొంటున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకొన్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications