వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SCO సదస్సులో మోడీ-జిన్ పింగ్ ఎడమొహం, పెడమొహం- నో షేక్ హ్యాండ్స్, నో స్మైల్స్...

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా మధ్య గల్వాన్ ఘర్షణల తర్వాత తలెత్తిన ఉద్రికతలు ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై భారత్-చైనా దేశాధిపతులు ఉమ్మడిగా కనిపించడమే గగనమవుతున్న వేళ.. ఇవాళ ఉజ్బెకిస్తాన్ లో ప్రారంభమైన షాంఘై సహకార సదస్సు (ఎస్.సి.ఓ)లో భారత ప్రధాని మోడీ, చైనా అధినేత జిన్ పింగ్ ఎడమొహం పెడమొహంగా ఉండిపోయారు.

ఎస్సీవో సదస్సుకు హాజరై ఒకే వేదిక పంచుకున్న ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కనీసం పలకరించుకోవడం కానీ, చిరునవ్వులు కానీ, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కానీ జరగలేదు. దీంతో ఇదే సదస్సుకు హాజరైన మిగిలిన దేశాధినేతలు అవాక్కయ్యారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశంలో కనెక్టివిటీని మెరుగుపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినప్పటికీ, భారత్ పొరుగు దేశమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో మాత్రం దూరంగా కనిపించారు.

SCO Summit : No handshake or smiles between pm modi and chinese president Xi jinping

గాల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారి అంతర్జాతీయ వేదికను పంచుకున్నారు. శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు పరస్పరం వ్యవహరించిన దూరం చూస్తే భారత్-చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్తత స్పష్టంగా కనిపిస్తోంది.ప్రధాని మోదీ నిన్న సాయంత్రం డిన్నర్ మీటింగ్‌కు కూడా దూరంగా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి శుక్రవారం సమయానికి చేరుకున్నారని చెబుతున్నారు. ఫోటో-ఆప్ సమయంలో, PM మోడీ మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పక్కపక్కనే నిలబడి ఉన్నారు, కానీ చిరునవ్వులు మార్చుకోలేదు లేదా కరచాలనం చేయలేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ఇతర నేతలు SCO సదస్సుకు హాజరయ్యారు. అలాగే సమాఖ్య వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రాంతీయ భద్రతా పరిస్థితి, వాణిజ్యం, కనెక్టివిటీని పెంపొందించే మార్గాలపై వీరంతా చర్చించారు.

English summary
pm modi and chinese president xi jinping have no handshakes and smiles during sco summit in ujbekistan today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X