Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వణికిన అఫ్గానిస్తాన్‌.. ఐదు గంటల్లో ఐదుసార్లు భూకంపాలు.. వందలాది మంది బలి !

అఫ్గానిస్థాన్‌ వరుస భూకంపాలతో వణికిపోయింది. ఐదు గంటల వ్యవధిలో ఐదు సార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపాల వల్ల భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు ఇంతవరకు 20 మంది చనిపోయారని ప్రాథమిక సమాచారం. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వందలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఐదు గంటల వ్యవధిలో ఐదు సార్లు..

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మొలజీ (NCS) ప్రకారం.. ఈ వరుస భూకంపాల్లో మొదటిది అత్యంత తీవ్రమైనది సోమవారం తెల్లవారుజామున 12:47 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం జలాలాబాద్‌కు 27 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 160 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వరుసగా 1:08 గంటలకు (4.7 తీవ్రత), 1:59 గంటలకు (4.3 తీవ్రత), 3:03 గంటలకు (5.0 తీవ్రత), మరియు 5:16 గంటలకు (5.0 తీవ్రత) భూమి కంపించింది.

series-of-earthquakes-in-afghanistan-and-hundreds-of-people-died

ప్రాణ, ఆస్తి నష్టం..

నంగర్హార్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నఖీబుల్లా రహిమీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపాల వల్ల ఇప్పటివరకు 20 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని US Geological Survey (USGS) అంచనా వేస్తోంది. వందలాది మంది మరణించి ఉండవచ్చు.

భూకంప తీవ్రత కారణంగా అనేక ప్రాంతాల్లో భవనాలు ఊగిపోయాయి. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల ఇళ్లు, భవనాలు కూలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

సరిహద్దు దేశాల్లోనూ ప్రకంపనలు..

ఈ భూకంపాల ప్రభావం కేవలం అఫ్గానిస్థాన్‌కే పరిమితం కాలేదని తెలుస్తోంది. దీని ప్రకంపనలు పాకిస్థాన్, తజికిస్థాన్, ఉత్తర భారతదేశంలోని సరిహద్దు ప్రాంతాలతో పాటు న్యూఢిల్లీలో కూడా సంభవించిందని చెబుతున్నారు. ఈ ప్రకృతి విపత్తు అఫ్గానిస్థాన్.. దాని సరిహద్దు దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగించిందని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+