షేక్ హసీనాకు బంగ్లాదేశ్ బిగ్ షాక్..! పాస్ పోర్ట్ ప్లాన్ కు చెక్-భారత్ పై ఒత్తిడి..!

దాదాపు రెండున్నరేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో విద్యార్ధుల నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు విఫలయత్నం చేసి పదవీచ్యుతురాలైన మాజీ ప్రధాని షేక్ హసీనా (sheikh Hasina) భారత్ కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. గతంలో భారత్ తో సఖ్యతగా వ్యవహరించిన కారణంతో న్యూఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో ఆమెకు ప్రభుత్వం శరణార్ధిగా ఆశ్రయం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో తన పార్టీ తుడిచిపెట్టుకుపోవడం, మరోవైపు విద్యార్ధుల హత్యలకు ఆదేశాలు ఇచ్చిన వ్యవహారంలో బంగ్లా ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించడం కూడా జరిగిపోయాయి. అలాగే భారత్ తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరుతోంది. అయినా భారత్ మాత్రం స్పందించడం లేదు.

Oil Prices: ఒక్క మాటతో చమురు ధరల్ని నేలకు దించిన ట్రంప్..!
Oil Prices: ఒక్క మాటతో చమురు ధరల్ని నేలకు దించిన ట్రంప్..!

ఈ నేపథ్యంలో తిరిగి స్వదేశానికి వెళ్లి పార్టీని కాపాడుకోవడం, దేశ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ గా మారే లక్ష్యంతో షేక్ హసీనా ఈ డిసెంబర్ లో బంగ్లాదేశ్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే నేరుగా వెళ్లినా ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. అలా కాకుండా మాజీ ప్రధాని హోదాలో దౌత్య పాస్ పోర్టు తీసుకుని, స్వదేశంలో అధికారిక హోదాలో అడుగుపెట్టేందుకు హసీనా ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు లండన్ లోని తన లీగల్ టీమ్ ద్వారా న్యూఢిల్లీలోని బంగ్లా ఎంబసీకి కొత్త పాస్ పోర్టుకు దరఖాస్తు చేస్తూ లేఖ రాశారు. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.

setback to sheikh Hasina as Bangladesh rejects passport request insists india to extradite her
బంగ్లాదేశ్ రిటర్న్ కు సిద్దమైన హసీనా..! తొలి అడుగు..! అంతలోనే ట్విస్ట్..!
బంగ్లాదేశ్ రిటర్న్ కు సిద్దమైన హసీనా..! తొలి అడుగు..! అంతలోనే ట్విస్ట్..!

షేక్ హసీనా కొత్త పాస్ పోర్టు కోసం చేసుకున్న దరఖాస్తును బంగ్లాదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. హసీనాకు పాస్ పోర్టు అవసరం లేదని, ఆమె సాధారణ ప్రయాణికురాలిగా బంగ్లాదేశ్ కు తిరిగి రావచ్చని విదేశాంగమంత్రి హుమాయున్ కబీర్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ద్వారా మరణశిక్ష విధించిన, ఢాకా ప్రభుత్వం పరారీలో ఉన్న నేరస్థురాలిగా పరిగణిస్తున్న షేక్ హసీనాకు కొత్త పాస్‌పోర్ట్ జారీ చేసే ప్రశ్నే తలెత్తదని ఆయన తేల్చిచెప్పేశారు. కాబట్టి భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమెను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని ఆయన మరోసారి డిమాండ్ చేసారు. ఆమె తిరిగి రావాలంటే, కొత్త ప్రయాణ పత్రాలను జారీ చేయడం ద్వారా కాకుండా, ఇప్పటికే ఉన్న చట్టపరమైన నిబంధనల ప్రక్రియ ద్వారానే జరగాలని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. దీంతో పాస్ పోర్టు తీసుకుని రాచమార్గంలో స్వదేశానికి వెళ్లాలనుకున్న షేక్ హసీనా కోరిక నెరవేరలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+