క్యాబేజీ కొనడానికి గ్రాసరీ స్టోర్ వెళ్లి, లాటరీలో రూ.1.5 కోట్ల జాక్‌పాట్ దక్కించుకుంది
వాషింగ్టన్: అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ మహిళ క్యాబేజీ కొనడానికి వెళ్తే ఆమెకు ఏకంగా 2,25,000 డాలర్ల లాటరీ తగిలింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె అక్షరాలు రెండు వందల ఇరవై అయిదు వేల డాలర్ల జాక్ పాట్ కొట్టేసింది.

క్యాబేజీ కొనడానికి వెళ్లింది
ఆ మహిళ పేరు వానెస్సా వార్డ్. ఆమె తండ్రి ఇటీవల క్యాబేజీ తీసుకు రావాలని పంపించాడు. ఆమె గ్రోవటన్‌లోని ఓ ఫుడ్ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ ఆమె తన తండ్రి చెప్పిన క్యాబేజీ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలోనే అక్కడ ఆమె ఓ స్పిన్ స్క్రాచ్ టిక్కెట్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది.

టిక్కెట్ తెరవగా జాక్‌పాట్
ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత టిక్కెట్‌ను స్క్రాచ్ చేసింది. టిక్కెట్ తెరవగానే తనకు తగిలిన జాక్‌పాట్ చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఈ గేమ్స్ టాప్ బహుమతిని గెలుచుకున్నట్లు ఆమె గుర్తించింది.

మన రూపాయల్లో రూ.1.5 కోట్లు
ఈ టిక్కెట్ ద్వారా లక్ష డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు ఎంతైనా గెలుచుకునే వీలు ఉంది. ఈ లాటరీలో ఆమె ఏకంగా 2,25,000 డాలర్లు గెలుచుకుంది. ఇది మన రూపాయల్లో దాదాపు రూ.1.5 కోట్లు.

గతంలో మరో మహిళకు
వానెస్సా టెంపుల్ హిల్స్‌లో నివసిస్తారు. ఈ డబ్బుతో తన రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలా ప్లాన్ చేస్తానని ఆమె చెప్పారు. డిస్నీ వరల్డ్‌కు ప్లాన్ చేస్తోంది. లాటరీని దక్కించుకున్న మేరీలాండ్ వాసుల్లో వానెస్సా ఒక్కరే లేరు. గత జూలై నెలలో మరో మహిళ కూడా లాటరీలో జాక్‌పాట్ కొట్టింది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications