బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఊహించని షాక్!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అవినీతి కేసులలో మరో బిగ్ షాక్ తగిలింది.తాజాగా సోమవారం ఢాకాలోని ఓ ప్రత్యేక కోర్టు పుర్భాచల్ ప్లాట్ కుంభకోణం కేసులో ఆమెకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో ఆమెకు ఇప్పటివరకు విధించిన మొత్తం శిక్ష 26 ఏళ్లకు చేరింది. ఈ తాజా కేసులో ఆమె సోదరి షేక్ రెహానాకు7 ఏళ్లు, ఆమె మేనకోడలు, బ్రిటన్ ఎంపీ అయిన ట్యూలిప్ సిద్ధిక్‌కు 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
కుంభకోణం ఏమిటంటే?
షేక్ హసీనా కుటుంబం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఢాకాలోని పుర్బాచల్ ప్రాంతంలో అక్రమంగా ప్లాట్‌లను తమ పేర్ల మీద చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కోర్టు న్యాయమూర్తి రబియుల్ ఆలం తీర్పు ఇస్తూ షేక్ హసీనా, ఆమె కుటుంబసభ్యులు ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని స్పష్టం చేశారు. హసీనా కుమారుడు సాజీబ్ వాజేద్ జాయ్, కుమార్తె సైమా వాజేద్‌లకు కూడా 5 ఏళ్ల చొప్పున జైలు శిక్ష, లక్ష టకా జరిమానా విధించారు.

షేక్ హసీనా కుటుంబం తరపున కోర్టులో న్యాయవాదులు ఎవరూ లేరు, ఎందుకంటే నిందితులందరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అంతకుముందు వారమే మరో కోర్టు మూడు వేర్వేరు ప్లాట్ కుంభకోణాల కేసుల్లో షేక్ హసీనాకు 7 ఏళ్ల చొప్పున మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.గతేడాది జూలై-ఆగస్టులో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసినందుకు గాను బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) షేక్ హసీనాను దోషిగా నిర్ధారించి, ఆమెకు మరణ శిక్ష కూడా విధించింది.
షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరుతున్న బంగ్లాదేశ్
ఆగస్టు 2024లో జరిగిన పెద్ద ఎత్తున నిరసనల తర్వాత షేక్ హసీనా భారత్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం ఆమెను తిరిగి అప్పగించాలని భారతదేశాన్ని కోరింది. ఈ అభ్యర్థనను న్యాయపరంగా పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి
ఈ కేసులో బ్రిటిష్ ఎంపీ ట్యూలిప్ సిద్ధిక్ పేరు కూడా రావడం బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. తమ ఎంపీకి బంగ్లాదేశ్ కోర్టు శిక్ష విధించడంపై లండన్‌లోని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు ఇరు దేశాల సంబంధాలను మరింత క్లిష్టం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications