కాల్పులు, బాంబులతో దద్దరిల్లిన మాస్కో కన్సర్ట్ హాల్: పదుల సంఖ్యలో మృతి
మాస్కో: రష్యా రాజధాని మాస్కో(Moscow)లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. స్థానిక క్రోకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లో పలువురు సాయుధులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం. పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు కాల్పులు, బాంబులు విసరడంతో కన్సర్ట్ హాల్‌లో మంటలు చెలరేగాయి.
ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఈ కన్సర్ట్ హాల్‌లో ప్రొగ్రాం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత హాల్‌లోకి ప్రవేశించిన సాయుధులు కాల్పులు జరుపుతూ, బాంబులు విసరుతూ బీభత్సం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

హాల్‌లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించేందుకు భారీ సంఖ్యలో అంబులెన్స్ లు అక్కడికి చేరుకున్నాయి. కాగా, ఈ దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు భయాందోళనలతో ఘటనా స్థలం నుంచి పారిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
[GRAPHIC]
— What the media hides. (@narrative_hole) March 22, 2024
The moment tеrrоrists entered the Crocus City Hall in Moscow pic.twitter.com/kwgGglvjiV
కాగా, గత రెండు దశాబ్దాల్లో రాష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా ఎన్నికైన కొద్ది రోజులకే రష్యా రాజధానిలో ఉగ్రదాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. పుతిన్ ప్రభుత్వం ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. కాగా, రష్యాలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇక్కడి అమెరికా రాయబార కార్యాలయం రెండు వారాల క్రితమే హెచ్చరించడం గమనార్హం.
Masked gunmen opened fire in the Crocus City Hall in Moscow. Several people reported killed.
— Anshul Saxena (@AskAnshul) March 22, 2024
And, around 2 weeks ago, US Embassy in Russia warned about a terrorist attack, potentially at a concert. pic.twitter.com/5g5YaErgBC












Click it and Unblock the Notifications