అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు స్పాట్ డెడ్ !
అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్న ఘటన సర్వత్రా కలకలం రేపింది. న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ ప్రాంతం, క్రౌన్ హైట్స్‌లో ఉన్న 'టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్' నైట్‌క్లబ్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. క్లబ్‌లో చిన్న గొడవ మొదలై.. మాటా మాటా పెరిగి పెద్దది కావడంతో చివరికి కాల్పులకు దారితీసినట్టు భావిస్తున్నారు. కాల్పులు జరిపిన దుండగులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్నారు.
ఈ ఘటనలో ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. మరణించిన ముగ్గురిలో ఇద్దరు 27, 35 ఏళ్ల వయస్సు గలవారని.. మూడవ వ్యక్తి వయస్సు ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు.

ఇక సంఘటన స్థలం నుంచి పోలీసులు ఒక తుపాకి, 36 బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పులకు కారణమైన వారిని ఇంకా గుర్తించలేదని.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోందని న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో డెమొక్రాట్లు గన్ కల్చర్‌పై నిషేధం విధించాలని బలంగా డిమాండ్ చేశారు. అయితే రిపబ్లికన్ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిమాండ్ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ వరుస ఘటనలతో గన్ నియంత్రణపై మరోసారి తీవ్రమైన చర్చలు మొదలయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
-
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!












Click it and Unblock the Notifications