లగ్జరీ రిసార్ట్ హోటల్‌ భస్మీపటలం: 76 మంది సజీవ దహనం: భయానకం

Turkey fire accident 2025: టర్కీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ రిసార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 76 మంది సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

టర్కీ వాయవ్య ప్రాంతంలోని బోలు మౌంటెయిన్స్ కర్తల్‌కాయాలో ఉంటుందీ స్కై రిసార్ట్ హోటల్. చుట్టూ ఎత్తైన మంచుకొండల మధ్య 12 అంతస్తుల్లో నిర్మితమైన అత్యంత విలాసవంతమైన హోటల్ ఇది. ఈ తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో మంటల బారిన పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Ski resort Hotel in Turkey s Bolu mountains caught by fire and killed 76 people

అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఈ హోటల్‌లో 238 మంది పర్యాటకులు, అతిథులు ఉన్నారు. చెక్కతో చేసిన గదులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల మంటలు వెను వెంటనే వ్యాప్తి చెందడానికి కారణం అయ్యాయి. నిద్రావస్తలో ఉన్న వాళ్లు ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మంటలు శరవేగంగా వ్యాప్తి చెందాయి. 70 శాతం వరకు స్కై రిసార్ట్ హోటల్ భస్మీపటలం అయింది. 76 మంది సజీవ దహనం అయ్యారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు పర్యాటకులు బెడ్‌షీట్లను తాడుగా చేసుకుని కిటికీల నుంచి కిందికి దూకారు. 3-4 అంతస్తుల నుంచి వాళ్లంతా ప్రాణభయంతో కిందికి దూకడం, రక్షించాలంటూ కేకలు పెట్టడం కనిపించింది.

సమాచారం అందిన వెంటనే పదుల సంఖ్యలో ఫైరింజిన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పివేశాయి. మూడు గంటల పాటు వాళ్లు శ్రమించాల్సి వచ్చింది. అగ్నిమాపకం- ఆ దేశ విపత్తు నిర్వహణ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన పట్ల టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డగాన్, హోం శాఖ మంత్రి అలి ఎర్లికాయా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని నేడు జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+