Sri Lanka Economic Crisis : నేడు కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం-కర్ఫూలోనూ నిరసనలు
శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో కేబినెట్ అంతా మూకుమ్మడి రాజీనామాలు సమర్పించిన నేపథ్యంలో కొత్త కేబినెట్ ఇవాళ కొలువు దీరబోతోంది. ప్రధాని మహీంద రాజపక్సే ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిన నేపథ్యంలో ఆయన మినహా మిగిలిన మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. దీంతో వారి స్ధానంలో కొత్త మంత్రులు పదవులు చేపట్టబోతున్నారు.
నిన్న అర్థరాత్రి శ్రీలంక కేబినెట్లోని మొత్తం 26 మంది మంత్రులు రాజీనామా చేసిన తర్వాత కొత్త శ్రీలంక క్యాబినెట్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తుందని అంచనా వేస్తున్నారు. విద్యా మంత్రి. సభా నాయకుడు దినేష్ గుణవర్దన మీడియాతో మాట్లాడుతూ క్రీడా మంత్రి, అధ్యక్షుడి మేనల్లుడు నమల్ రాజపక్సతో సహా క్యాబినెట్ మంత్రులు తమ రాజీనామాలను ప్రధాన మంత్రి మహింద రాజపక్సకు అందజేసినట్లు చెప్పారు. సామూహిక రాజీనామాకు కారణం మాత్రం ఆయన వెల్లడించలేదు.

శ్రీలంకలో తలెత్తిన అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంపై దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీతో పాటు కర్ఫ్యూ కూడా విధించారు. ఈ 36 గంటల కర్ఫ్యూ ఇవాళ ఉదయం ఎత్తివేశారు. అయినప్పటికీ దేశం ఇప్పటికీ అత్యవసర పరిస్థితి ప్రభావంలోనే ఉంది. మార్చి 31 న అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ప్రైవేట్ నివాసాన్ని నిరసనకారులు చుట్టుముట్టిన నేపథ్యంలో ఈ ఎమర్జెన్సీ విధించారు. అయితే కొత్త మంత్రులు పదవుల్లోకి వచ్చినా ప్రభుత్వం కొత్త విధానాలు ప్రకటించకపోతే మాత్రం నిరసనలు ఆగే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications