అమెరికాకు డెడ్ లైన్ పెట్టిన తాలిబన్లు-ఆగస్టు 31 తర్వాత కనిపిస్తే తీవ్ర పరిణామాలంటూ వార్నింగ్
ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించిన తాలిబన్లు.. ఇప్పుడు క్రమంగా అక్కడి నుంచి విదేశీ సైన్యాలను తరిమికొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ముందుగా ప్రపంచ పెద్దన్న అమెరికా బలగాలను తరిమికొట్టేందుకు డెడ్ లైన్ విధించారు. ఆగస్టు 31లోగా తమ దేశం విడిచిపెట్టి వెళ్లాలని తాలిబన్లు అమెరికాకు డెడ్ లైన్ ఇచ్చారు.
ఇన్నాళ్లూ ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం ఉండటంతో అమెరికా బలగాలు వారికి అండగా ఉండేందుకు అక్కడే పాగా వేశాయి. ఆప్ఘనిస్తాన్ రక్షణ పేరుతో భారీ ఎత్తున బలగాలు మొహరించడమే కాకుండా అక్కడి ప్రభుత్వాన్ని తమ కన్నుసన్నల్లో ఉండేలా చూసుకున్నాయి. అయితే ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారంతా తిరిగి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు తాలిబన్ల రాకతో మళ్లీ అమెరికా బలగాల అవసరం పెరుగుతోంది. అమెరికా తప్పిదం వల్లే ఆప్ఘనిస్తాన్ లిబన్ల పరమైందంటూ అంతర్జాతీయంగా వినిపిస్తున్న విమర్శలతో అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా కీలక ప్రకటన చేశారు. దీనిపై తాలిబన్లు స్పందించారు.

ఆగస్టు 31 తర్వాత తమ దేశంలో ఉంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా బలగాలకు తాలిబన్లు ఇవాళ హెచ్చరికలు చేశారు. అమెరికా బలగాలు ఆప్ఘనిస్తాన్ వీడేందుకు ఆగస్టు 31ను డెడ్ లైన్ గా విధించిన తాలిబన్లు.. అప్పటికీ వాళ్లు వెళ్లకపోతే దాడులకు దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాబూల్ ఎయిర్ పోర్టును అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నా.. దాని బయట మాత్రం తాలిబన్లు భారీగా కాపలా కాస్తున్నారు. అమెరికాతో ఇన్నేళ్లు ముఖాముఖీ పోరు సలిపిన తాలిబన్లు.. ఇప్పుడు ఆప్ఘన్ ప్రభుత్వం కుప్పకూలాక ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నార్నది కీలకంగా మారింది. అయితే అమెరికా బలగాలు నేరుగా దాడికి దిగితే తట్టుకునే శక్తి తాలిబన్లకు ఉందా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు తాలిబన్లకు పాకిస్తాన్, చైనాతో పాటు ఇతర దేశాలు మద్దతిస్తున్న నేపథ్యంలో బలం పెరిగినట్లు కనిపిస్తున్నా అమెరికాను ఎదిరించే సత్తా లేకపోవచ్చని భావిస్తున్నారు. అయినా తాలిబన్లు చేస్తున్న హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications