ఎలాన్ మస్క్ vs టేలర్ స్విఫ్ట్: ట్విస్టుల మీద ట్విస్టులు
Elon Musk vs Taylor Swift: గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ డిబేట్‌కు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వారిద్దరి మధ్య ఏర్పాటైన తొలి డిబేట్ ఇదే.

పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా దీనికి వేదిక. అమెరికా కాలమాన ప్రకారం సరిగ్గా మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ డిబేట్ ఆరంభమైంది. లారా లూమర్.. దీనికి కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఏబీసీ న్యూస్ ఈ డిబేట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ఈ డిబేట్ తరువాత ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయినట్టే కనిపిస్తోంది. కమలా హ్యారిస్‌కు మద్దతు పెరుగుతోంది. ఆమెకు మద్దతు ఇస్తోన్న వారి సంఖ్య మెరుగుపడింది. కొందరు టాప్ సెలెబ్రిటీలు సైతం కమలా హ్యారిస్ వైపు మొగ్గు చూపుతోండటం దీనికి నిదర్శనం.
అమెరికన్ సింగర్- లిరిక్ రైటర్ టేలర్ స్విఫ్ట్.. కమలా హ్యారిస్‌కు తన మద్దతును ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కమలా హ్యారిస్- టిమ్ వాల్జ్ ద్వయానికి ఎందుకు మద్దతు ప్రకటించాల్సి వచ్చిందో ఇందులో వివరంగా రాసుకొచ్చారు.
అధికారంలోకి వచ్చిన తరువాత కమలా హ్యారిస్- టిమ్ వాల్జ్.. ఎల్జీబీటీక్యూ, వారి హక్కులు, ఐవీఎఫ్, మహిళా హక్కుల కోసం కృషి చేస్తారనే బలమైన నమ్మకం ఈ డిబేట్ తరువాత తనకు కలిగిందని, ఈ ఎన్నికల్లో తాను అధ్యక్ష పదవికి కమలా హ్యారిస్, ఉపాధ్యక్షుడిగా టిమ్ వాల్జ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తోన్నానని, వారిద్దరికే తాను ఓటు వేస్తానని టేలర్ స్విఫ్ట్ వెల్లడించారు.
ఆమె చేసిన ఈ పోస్ట్‌కు టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ రియాక్ట్ అయ్యారు. ఫైన్ టేలర్.. మీరు గెలిచారు.. అంటూ కామెంట్ చేశారు. ఆమె పెంచుకుంటోన్న పిల్లులను రక్షణ కల్పించడానికి ఓ పిల్లవాడిని, సంరక్షుడిని తాను ఇస్తానంటూ సెటైర్ వేశారు.












Click it and Unblock the Notifications