తేజస్ ఫైటర్ జెట్ ధర ఎంతో తెలుసా ? రఫేల్, F-16 తో పోల్చితే..
యూఏఈలో జరిగిన దుబాయ్ ఎయిర్ షో- 2025 కార్యక్రమంలో భారత్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ విన్యాసాలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్, వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్ మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అధికారికంగా వెల్లడించింది. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ ఎగిసిపడింది. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటన అల్ మక్ టౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాలకు జరిగింది.
అయితే భారత్ అమ్ముల పొదిలో ప్రతిష్టాత్మకంగా భావించిన తేజస్ ఫైటర్ జెట్ ను పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని అత్యాధునిక ఫైటర్ జెట్స్ లో అత్యంత చౌకైన యుద్ధ విమానం ఇదే కావడం విశేషం. రఫేల్, ఎఫ్-22 రాప్టర్, యూరోఫైటర్ టైఫూన్ తదితర ఫైటర్ జెట్స్ కంటే తేజస్ యుద్ధ విమానం వ్యయం చాలా తక్కువ అని తెలుస్తోంది. తేజస్ యుద్ధ విమానాన్ని భారత్ కు చెందిన హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(HAL) సంస్థ తయారు చేసింది.
తేజస్ ఫైటర్ జెట్ లో ఎంకే-1A వేరియంట్.. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు. ఇది 4.5 జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ యుద్ధవిమానంలో యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్ డ్ అర్రే రాడార్, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్, అలాగే ఎయిర్ టూ ఎయిర్ రీ ఫ్యూయలింగ్.. తదితర అత్యాధునిక సాంకేతికలను అమర్చారు. ఈ ఏడాది ఆగస్టులో 97 తేజస్ ఎంకే-1A ఫైటర్ జెట్స్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిమొత్తం ధర రూ. 62,000 కోట్లుగా ఉంది. అంటే ఒక్కో తేజస్ ఫైటర్ జెట్ ధర రూ. 640 కోట్లు అని స్పష్టం అవుతోంది.

2021 లో రక్షణ మంత్రిత్వ శాఖ.. 83 తేజస్ ఎంకే-1A ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. వీటి మొత్తం ఖర్చు రూ. 48,000 కోట్లు కాగా.. ఒక్కో ఫైటర్ జెట్ కు రూ. 578 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఫైటర్ జెట్స్ తో పోల్చితే వీటి ధర చాలా తక్కువ అని స్పష్టం అవుతోంది. మరోవైపు ఒక రఫేల్ యుద్ధ విమానం ధర రూ. 1,300 కోట్లుగా ఉంది. అలాగే లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్-22 రాప్టర్ ను అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్ గా పిలుస్తారు. ఒక్కో యూనిట్ ధర 143 మిలియన్ డాలర్లు ఉంటుంది. అలాగే యూరో ఫైటర్ టైఫూన్ ధర 117 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇక చైనాకు చెందిన చెంగ్డూ జే-20 ఫైటర్ జెట్ ధర 110 మిలియన్ డాలర్లుగా ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications