ఆ కుక్క ఎంత తెలివికలదో మీకు తెలిస్తే.. ఔరా.. అనాల్సిందే!!
మనుషులకన్నా జంతువుల తెలివితేటలే ఎక్కువ. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా వాటిదే. సోషల్ మీడియాల్లో వాటి వీడియోలే హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అది ఎంతో నైపుణ్యంగా, తెలివిగా కారు డ్రైవింగ్ చేస్తోంది. యజమాని చెప్పినదాన్ని సులభంగా నేర్చేసుకోవడంతో దాని యజమాని పొంగిపోయి వీడియో తీసి పోస్ట్ చేస్తే వేలల్లో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాను ఒక వీడియో షేక్ చేస్తోంది. విక్టోరియాలోని హామిల్టన్‌కు చెందిన ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కకు డ్రైవింగ్ నేర్పాడు. అది కూడా చక్కగా నేర్చుకుంది. దాని ఎత్తు ఎంత? సీట్లో కూర్చొని కారు నడిపితే కింద బ్రేకులు వేయడం ఎలా ? అనే సందేహం మీకు రావాలి. ఎందుకంటే అది చాలా ప్రొఫెషనల్‌లా డ్రైవింగ్ చేస్తోంది.

నిజమే.. ఆ కుక్కకు కారు బ్రేక్, యాక్సలేటర్ అందకపోయినా స్టీరింగ్ ను మాత్రం బాగా కంట్రోల్ చేస్తోంది. ఇది డ్రైవింగ్ చేయడమేకాదు.. అంతకుముందు గొర్రెల కాపరిగా పనిచేసిందంట. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకొని ట్రక్ నడుపుతుందికానీ గొర్రెల కాపరిగా పనిచేసిన సమయంలో ఒక్క గొర్రెను కూడా మంద నుంచి బయటకు పోకుండా చూసేదంట. ఆ యజమానికి చెందిన గొర్రెల మందకే కాపరిగా ఉండేది. తన కుక్క తెలివితేటలకు దాని యజమాని ఎంతో పొంగిపోతున్నాడు.












Click it and Unblock the Notifications